Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీడియాపై తప్పుడు కేసులు పెడతారా? ఏంటిది? చంద్రబాబు ఫైర్

Advertiesment
Chandra babu naidu
, శుక్రవారం, 24 జనవరి 2020 (11:52 IST)
మీడియాపై తప్పుడు కేసులు పెట్టడాన్ని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు. మందడంలోని పాఠశాలలో తరగతి గదులను పోలీసులు ఆక్రమించారు. విద్యార్ధులను బైటకు పంపడంపై మీడియాకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా విలేకరులు, ఫొటోగ్రాఫర్లు పాఠశాలకు వెళ్లారు. తరగతి గదుల్లో ఆరేసిన పోలీసుల దుస్తులను ఫొటోలు తీశారు, ఛానళ్లలో ప్రసారం చేశారు.
 
దానిపై అక్కసుతోనే ముగ్గురు విలేకరులపై అక్రమ కేసులు పోలీసులు పెట్టారు. మీడియాపై నిర్భయ కేసు పెట్టడం ప్రభుత్వ కక్ష సాధింపునకు పరాకాష్ట. మీడియా గొంతు నులిమే నియంత పోకడలను ఖండిస్తున్నాం. గత 8నెలలుగా రాష్టంలో సీఎం జగన్ నిరంకుశ పాలన. మీడియాపై రాష్ట్ర ప్రభుత్వ అణిచివేత చర్యలను గర్హిస్తున్నాం. తొలి నెల లోనే ఎంఎస్ ఎంవోలతో ముగ్గురు మంత్రులు మీటింగ్ పెట్టి బెదిరించారు. 
 
2ఛానళ్లను ప్రసారం చేయరాదని రెండో నెల నుంచి ఆంక్షలు పెట్టారు. అసెంబ్లీ ప్రసారాలకు 3ఛానళ్లపై నిషేధం విధించారు. జీవో 2430తెచ్చి మీడియాపై ఉక్కుపాదం మోపారు. మీడియాపై దౌర్జన్యాలు చేసిన వైసిపి నేతలను ఏం చేశారు..? తునిలో విలేకరిని హత్య చేశారు, చీరాలలో విలేకరిపై హత్యాయత్నం చేశారు, నెల్లూరులో ఎడిటర్ పై వైసిపి ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారు, చంపుతామని బెదిరించారు. 
 
రాష్ట్రంలో పాత్రికేయులకు రక్షణ లేకుండా పోయింది. ఫోర్త్ ఎస్టేట్ మీడియా మనుగడకే ముప్పు తెచ్చారు. వైసిపి దుశ్చర్యలను ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలి. గత 37రోజులుగా రాజధానిలో రైతులు,మహిళలు,రైతుకూలీలపై పోలీసుల దౌర్జన్యాలు. ఆడబిడ్డల కడుపులో బూటుకాళ్లతో తొక్కారు. రాత్రివేళ పోలీస్ స్టేషన్లలో మహిళల అక్రమ నిర్బంధం.

గుడికివెళ్లే మహిళలను లాఠీలతో కొట్టారు. పసుపు,కుంకుమ,పొంగళ్ల నైవేద్యాలు నేలపాలు చేశారు. రైతులు, రైతుకూలీలను జైళ్లకు పంపారు. వీటన్నింటిని ప్రసారం చేశారనే మీడియాపై ప్రస్తుతం తప్పుడు కేసులు పెట్టారు.
మీడియాతో పెట్టుకున్న వాళ్లంతా పతనం అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకుంటారు.
 
తక్షణమే ఈ టివి రిపోర్టర్, ఫొటోగ్రాఫర్, టివి 5 రిపోర్టర్ పై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయాలి.. అంటూ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎక్స్‌ప్రెస్ రైళ్ల మార్గాలు మార్పులు..