Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎక్స్‌ప్రెస్ రైళ్ల మార్గాలు మార్పులు..

ఎక్స్‌ప్రెస్ రైళ్ల మార్గాలు మార్పులు..
, శుక్రవారం, 24 జనవరి 2020 (11:32 IST)
విశాఖ-నిజాముద్దీన్‌ల నుంచి ఇప్పటివరకు ప్రయాణికులకు సేవలందిస్తున్న నెంబర్‌ 18561, 18562 గల ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఈ నెల 25 నుంచి విశాఖ-కాచిగూడల మధ్య విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలుగా మార్పు చేస్తూ రైల్వే కమర్షియల్‌ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 
 
సామర్లకోట రైల్వే స్టేషన్‌కు ఈ మేరకు అందిన సమాచారం ప్రకారం విశాఖలో ఈ నెల 25న 18561 నంబరు గల విశాఖ ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 2.50కు బయలుదేరి సాయంత్రం సామర్లకోటకు 5.05గంటలకు చేరుతుంది. 
 
26న తెల్లవారుజామున 3.45 గంటలకు కాచిగూడ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 26 నుంచి 18562 నెంబరు గల విశాఖ ఎక్స్‌ప్రెస్‌ కాచిగూడలో రాత్రి 11.50గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.18గంటలకు సామర్లకోట చేరుతుంది. 
 
అనంతరం మధ్యాహ్నం 1.30కి విశాఖ చేరుతుంది. నూతనంగా విశాఖ ఎక్స్‌ప్రెస్‌గా మార్పు చెందిన ఈ రైలు విశాఖపట్టణం, దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట జంక్షన్‌, రాజమహేంద్రవరం, నిడదవోలు జంక్షన్‌, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్ణకల్‌, మహబూబాబాద్‌, కేసముద్రం, వరంగల్‌, ఖాజీపేట, మల్కాజీగిరి, కాచిగూడ స్టేషన్లలో ఆగుతుందని, ఏసీ 2 టైర్‌, 3 ఏసీ 3 టైర్‌, 8 స్లీపర్‌, 4 జనరల్‌, 2 లగేజి కమ్‌ బ్రేక్‌వ్యాన్‌తో భోగీలుంటాయని రైల్వే అధికారులు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్.. హత్యాచారం జరిగిందా?