Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#NaarappaFirstLook ఊరమాస్ లుక్‌లో విక్టరీ వెంకటేష్

Advertiesment
Victory Venkatesh
, బుధవారం, 22 జనవరి 2020 (10:50 IST)
కోలీవుడ్ సూపర్ మూవీ అసురన్ తెలుగులోకి నారప్పగా రీమేక్ అవుతోంది. తమిళనాట ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన అసురన్ మూవీ 2019లో సంచలన విజయం సాధించింది. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రంలో ధనుష్ రోల్‌లో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారు.
 
తాజాగా ఈ సినిమా లుక్ విడుదలైంది. ఇందులో వెంకీ లుక్ అదిరింది. అసురన్ గెటప్‌లో వెంకీ అచ్చం ధనుష్‌లా ఆకట్టుకున్నారు. వెంకీకి ఇది 74వ సినిమా. ఈ చిత్రానికి 'నారప్ప' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నారప్ప మూవీకి సంబంధించి నాలుగు పోస్టర్లను సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేసింది. 
 
ఈ లుక్స్‌లో ఊరమాస్ లుక్‌లో కనిపించి విక్టరీ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.  ప్రస్తుతం వెంకటేష్ కూడా అసురన్ రీమేక్ ద్వారా హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ‘ఎఫ్ 2’, ‘వెంకీమామ’ వరుస హిట్లతో జోరు మీద ఉన్న విక్టరీ వెంకటేష్.. అసురన్ రీమేక్‌ నారప్ప ద్వారా మంచి కలెక్షన్లు రాబట్టేలా వున్నాడు. వెంక‌టేశ్ స‌ర‌స‌న ప్రియ‌మ‌ణి నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్‌లో సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జనవరి 22 నుంచి 3వారాల పాటు తొలి షెడ్యూల్ జరగనుంది. రాయలసీమలోని అనంతపూర్ పరిసర ప్రాంతాల్లోని రియలిస్టిక్ లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#Pranam From Jaanu కూల్ అండ్ ఫీల్ గుడ్ సాంగ్.. (వీడియో)