Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'R ఎలాన్ రన్ టు ఇండియా లిట్టర్ ఫ్రీ' గ్రాండ్ ఫినాలె, భారతదేశంలో వ్యర్థాలను ఏరిపడేస్తూ...

Advertiesment
'R ఎలాన్ రన్ టు ఇండియా లిట్టర్ ఫ్రీ' గ్రాండ్ ఫినాలె, భారతదేశంలో వ్యర్థాలను ఏరిపడేస్తూ...
, గురువారం, 5 డిశెంబరు 2019 (21:08 IST)
ఇది నిజంగా గ్రాండ్ ఫినాలె. మనం టీవీ షోల్లో వచ్చే గేమ్ షోల ఫైనళ్లను గ్రాండ్ ఫినాలె అని చెప్పే మాటను వింటుంటాం. అవన్నీ వినోదాన్ని పంచే ఫినాలేలు మాత్రమే. కానీ మానవ జీవితాలను ఆరోగ్యంగా మార్చేసే ఫినాలె ఎలా వుంటుందో తెలుసుకోవాలనుందా. ఐతే ఇవాళ ఢిల్లీలో జరిగిన ఈ ఫినాలే గురించి తెలుసుకోవాల్సిందే. అదే R ఎలాన్ రన్ టు ఇండియా లిట్టర్ ఫ్రీ గ్రాండ్ ఫినాలె. ఈసరికే మీకు అర్థమై వుంటుంది. 
 
భారతదేశాన్ని వ్యర్థాల రహిత దేశంగా మార్చేందుకు రిలయన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తనవంతు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశంలోని 50 నగరాల్లో R ఎలాన్ నిర్వహించిన రిపు డామన్ బెవ్లీతో కలిసి 50 నగరాలు ప్లగింగ్ చేస్తూ వచ్చిన “R ఎలాన్ రన్ టు ఇండియా లిట్టర్ ఫ్రీ”కి ముగింపు పలికింది. ఈ కార్యక్రమానికి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ రోజు అద్భుతమైన స్పందన వచ్చింది.
webdunia
ముంబై, హైదరాబాద్ మరియు కోల్‌కతాలోని ముఖ్య నగరాల్లో పిట్-స్టాప్‌లతో 2019 సెప్టెంబర్ 5న కొచ్చి నుండి ప్రారంభమైంది ఈ మహా కార్యక్రమం. 'ఆర్ ఎలాన్ రన్ టు ఇండియా లిట్టర్ ఫ్రీ'లో భాగంగా దేశంలోని 50 నగరాల్లో 1000  కిలోమీటర్ల విస్తీర్ణంలో 2.7 టన్నుల చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం జరిగింది.
 
ఆరోగ్యం - పర్యావరణ ఔత్సాహికులలో, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, అదే సమయంలో ఫిట్‌నెస్‌ను పెంచే అలవాటును పెంపొందించే ఉమ్మడి లక్ష్యాన్ని నడపడానికి R ఎలన్ ఇండియా, భారతదేశపు మొదటి ప్లగర్ రిపు డామన్‌తో కలిసి ముందుకు సాగారు.
 
ఇలా సేకరించిన మొత్తం వ్యర్థాలను ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో నెలకొల్పబడిన RIL యొక్క పోస్ట్-కన్స్యూమర్ పిఇటి బాటిల్ రీసైక్లింగ్ ప్లాంటుకు పంపడం జరిగింది. ఇక్కడ ప్రతి ఏటా 2.25 బిలియన్ పిఇటి బాటిళ్లను రీసైకిల్ చేస్తుంటారు. ఇలా చేస్తున్న రీసైక్లింగ్ ప్లాంట్ ప్రపంచంలో ఒకటిగా గుర్తింపు కలిగి వుంది. ఈ రీసైక్లింగ్ ప్రక్రియలో సేకరించి తీసుకు వచ్చిన వ్యర్థాలన్నీ గ్రీన్‌గోల్డ్ ఫైబర్‌లుగా మారుస్తారు.
webdunia
‘ఆర్ ఎలాన్ రన్ టు మేక్ ఇండియా లిట్టర్ ఫ్రీ’ గురించి సిఐఓ - పాలిస్టర్ బిజినెస్, ఆర్‌ఐఎల్ గుంజన్ శర్మ ఇలా చెప్పారు: “ఈ లిట్టర్ ప్లగింగ్ రన్‌కు దేశవ్యాప్తంగా అమోఘమైన స్పందన వచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా వ్యర్థాలను సేకరించడమే కాదు పౌరులలో ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను పెంపొందించే మా ధ్యేయాన్ని సాధించడానికి ఇది ఎంతగానో సహాయపడింది. సేకరించిన పిఇటి బాటిళ్లతో తయారు చేసిన ఆర్ ఎలాన్ మెరుగైన దుస్తులను మేము తయారు చేస్తాము. ఈ టెక్నాలజీలో భారతదేశంలోనే బలమైన తయారీదారులుగా వున్నందుకు గర్వంగా వుందని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శబరిమలపై 2018 తీర్పు అంతిమం కాదు: సుప్రీంకోర్టు