Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శబరిమలపై 2018 తీర్పు అంతిమం కాదు: సుప్రీంకోర్టు

శబరిమలపై 2018 తీర్పు అంతిమం కాదు: సుప్రీంకోర్టు
, గురువారం, 5 డిశెంబరు 2019 (20:38 IST)
రాజకీయ కారణాలతోశబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై 2018లో ఇచ్చిన తీర్పు అంతిమం కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆలయంలోకి ప్రవేశిస్తుండగా తనపై దాడి చేశారంటూ ఓ మహిళ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం.

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో ఇచ్చిన తీర్పు అంతిమం కాదని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ఈ విషయంపై విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టనుందని పేర్కొంది. ఇటీవల ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారని మహిళా కార్యకర్త బిందు అమ్మిని వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ పిటిషన్​పై వచ్చే వారం విచారణ చేపట్టేందుకు సీజేఐ జస్టిస్ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ గతేడాది ఇచ్చిన తీర్పు అంతిమం కాదని, ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తుది నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా స్పష్టంచేసింది.

మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ 2018 సెప్టెంబర్​లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ వ్యాజ్యాలు దాఖలవగా... కేసు విచారణను నవంబర్​ 14న విస్తృత ధర్మాసనానికి అప్పగించింది న్యాయస్థానం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేటీఆర్​ నాపై ఒత్తిడి చేస్తున్నారు: మంత్రి హరీశ్​రావు