Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ: హైకోర్టు

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ: హైకోర్టు
, మంగళవారం, 12 నవంబరు 2019 (18:49 IST)
ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని అడ్వొకేట్‌ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

1998లోనే ఎస్మా కింద ఉత్తర్వులు రూట్ల ప్రైవేటీకరణపై తదుపరి చర్యలు చేపట్టవద్దన్న ఉత్తర్వులు రేపటి వరకు పొడిగించింది హైకోర్టు. ఈరోజు జరిగిన వాదనల్లో ఎస్మా కింద సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించవచ్చా అంటూ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.

ఆర్టీసీని 1998, 2015లో ఎస్మా కింద పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని న్యాయవాది విద్యాసాగర్ న్యాయస్థానానికి తెలిపారు. 1998లో ఇచ్చిన ఉత్తర్వులు ఏపీఎస్‌ఆర్టీసీకి అని.. టీఎస్‌ఆర్టీసీకి కాదని హైకోర్టు స్పష్టం చేసింది. 2015లో ఇచ్చిన ఉత్తర్వుల్లో ఆరు నెలలకే వర్తిస్తుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

సమ్మె చట్ట విరుద్ధమా..? కాదా..? అనే అంశంపై న్యాయవాది విద్యాసాగర్‌ను వివరణ కోరింది. అధిక ఛార్జీలు బస్సుల్లో అధిక ఛార్జీల వసూలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అధిక ఛార్జీల వసూలుపై వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేయవచ్చని న్యాయస్థానం తెలిపింది.

అధిక ఛార్జీల కారణంగా సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించలేమని స్పష్టం చేసింది. యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని ఏ చట్టంలో ఉందని ప్రశ్నించిన హైకోర్టు... చర్చలు జరపాలని ఏ ప్రాతిపదికన ఆదేశించగలదని వ్యాఖ్యానించింది.

చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీని మేమెలా ఆదేశించగలమో చెప్పాలన్న ధర్మాసనం... తాము చట్టానికి అతీతం కాదని... చట్టాల పరిధి దాటి వ్యవహరించలేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. హైకోర్టులో విచారణ పెండింగులో ఉన్నందున తదుపరి చర్యలు చేపట్టలేకపోయామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్రమ కేసులతో వేధిస్తున్నారు: అఖిల ప్రియ