Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చట్టసభలు విధులను సక్రమంగా వ్యవహరించేందుకే కమిటీలు: తమ్మినేని

Advertiesment
చట్టసభలు విధులను సక్రమంగా వ్యవహరించేందుకే కమిటీలు: తమ్మినేని
, బుధవారం, 23 అక్టోబరు 2019 (20:30 IST)
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చటంలో చట్టసభల కమిటీలు అత్యంత కీలకమైన పాత్రను నిర్వహిస్తాయని శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ అన్నారు.

బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ప్రజాపద్దుల కమిటీ ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కమిటీలలో ఆర్థిక అంశాలను పరిశీలించే ప్రజాపద్దుల కమిటీ, అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ కీలక పాత్ర నిర్వహిస్తాయని ఆయన తెలిపారు. 

బడ్జెట్‌లో ఏ పద్దు ఎంత మొత్తాన్ని చట్టసభలు ఆమోదించాయో ఆ పద్దుకిందే ఆ ధనాన్ని వినియోగిస్తున్నారా లేదా అని పరిశీలిస్తాయని, అవకతవకలు జరిగానా పన్నుల వసూళ్ల రూపంలో లోపాలను గుర్తించి నివేదిక అందించే బాధ్యత ఈ కమిటీలదేనని ఆయన వివరించారు.

రాజ్యాంగం ద్వారా, శాసన సభ నియమాళి ద్వారా సంక్రమించిన అధికారాలను సక్రమంగా వినియోగిస్తూ ఈ మూడు ఆర్థిక కమిటీలు తమ విధులను నిర్వహించినట్లైతే శాసనసభ కమిటీల పనితీరు ఎంతో మెరుగ్గా ఉంటుందని ఆయన సూచించారు. నెలకి కనీసం ఒకటి రెండు సార్లు సమావేశమై ఎజెండా ప్రకారం అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యనిర్వాహక వర్గము రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించేలా పర్యవేక్షించే బాధ్యత చట్టసభలకు ఇచ్చిందని వెల్లడించారు.  చట్టసభలు విధులను సక్రమంగా వ్యవహరించేందుకే కమిటీలు ఏర్పాటు చేసుకున్నామని స్పష్టం చేశారు. బడ్జెట్ లో ఎంత మొత్తాన్ని చట్టసభలు ఆమోదించాయోనని పర్యవేక్షించే బాధ్యత కమిటీలదేనని తెలిపారు.

ఏ లక్ష్యాన్ని ఆశించి ఈ కమిటీలు ఏర్పడ్డాయో వాటి సాధన కోసం కమిటీ సభ్యులే పార్టీలకతీతంగా సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. ప్రజాపద్దుల కమిటీ అధ్యక్షులుగా నియమితులైన పయ్యావుల కేశవ్ కు, అంచనాల కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన పీడిక రాజన్నదొరకు, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ అధ్యక్షులుగా నియమితులైన చిర్ల జగ్గిరెడ్డికి, ఇతర కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా సభాపతి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ప్రజాపద్దుల కమిటీ, అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ల అధ్యక్షుల అధ్యక్షతన ప్రారంభ సమావేశం నిర్వహించారు. ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మేరుగ నాగార్జున, కరణం ధర్మశ్రీ, జోగి రమేష్, కేవీ ఉషశ్రీచరణ్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, డి. జగదీశ్వర్ రావు, విఠపు బాలసుబ్రహ్మణ్యం లు కమిటీ సభ్యులుగా హాజరయ్యారు. 

అంచనాల కమిటీ  అధ్యక్షుడు రాజన్న దొర అధ్యక్షతన జరిగిన సమావేశంలో గుడివాడ అమర్ నాథ్, గొర్లె కిరణ్ కుమార్, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్, మద్దాలి గిరిధర్‌రావు, ఆదిరెడ్డి భవాని, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్‌బాబు, వెన్నుపూస గోపాల్ రెడ్డి,

ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన గ్రంధి శ్రీనివాస్, కిలారి వెంకటరోశయ్య, జొన్నలగడ్డ పద్మావతి, చెల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, రవీంద్రనాథ్ రెడ్డి, డి.చంద్రశేఖర్ రెడ్డి, ఎం.వెంకట సత్యనారాయణరాజు,జి. దీపక్ రెడ్డి, సోము వీర్రాజు హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెంటిలేటర్‌పైకి రాష్ట్ర ఆర్థికవ్యవస్థ.. పీఏసీ ఛైర్మన్‌