తెలంగాణ శాసనసభ స్థాయి సంఘాలకు చైర్మన్లు ఖరారయ్యారు. కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీకి దక్కనుంది. కాంగ్రెస్‌కు ప్రతిపక్షహోదా పోయిన తర్వాత ఆ స్థానంలోకి మజ్లిస్ వచ్చింది.
ఆ లెక్క ప్రకారం పీఏసీ పదవి వారికి ఇవ్వనున్నారు. పీఏసీ చైర్మన్‌గా మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, పీయూసీ చైర్మన్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్ పద్మారావు, అంచనాల కమిటీ చైర్మన్‌గా సోలిపేట రామలింగారెడ్డి, ఎస్సీ వెల్‌ఫేర్ కమిటీ చైర్మన్‌గా కాలె యాదయ్య,ఎస్టీ వెల్‌ఫేర్ కమిటీ చైర్మన్‌గా రెడ్యూ నాయక్, ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌గా స్పీకర్ పోచారం, పేపర్స్ లేడ్ ఆన్ టేబుల్ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ జాఫ్రి నియమితులయ్యారు.