రాజ్‌భవన్ సిబ్బంది, వారి కుటుంబసభ్యుల కోసం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లోని సంక్షేమ భవన్‌లో యోగా తరగతులను ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్యకృత్యంగా మార్చుకోవాలని సూచించారు.
హైదరాబాద్ రాజ్‌భవన్‌లోని సంక్షేమ భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యోగా తరగతులను ప్రారంభించారు. రాజ్‌భవన్ సిబ్బంది, వారి కుటుంబసభ్యుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తరగతుల్లో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు.
ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు నిర్వహించిన ఆ యోగా తరగతుల్లో గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్, సలహాదారు ఏపీవీఎన్ శర్మతో పాటు సుమారు 200 మంది సిబ్బంది కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. ప్రతిరోజూ యోగా చేద్దాం: గవర్నర్ ప్రతి రోజు యోగా తరగతుల్లో పాల్గొనాలని గవర్నర్ కోరారు. ప్రధాని పిలుపుచ్చిన 'ఫిట్ ఇండియా' ఉద్యమానికి బలం చేకూరేలా ప్రతి రోజు అందరం యోగా చేద్దామన్నారు.
రాజభవన్ స్కూల్‌లో 6 నుంచి 10వ వరకు చదువుతున్న 450 మంది విద్యార్థులకు ప్రతి శనివారం ఈ అంశంపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తమిళిసై వివరించారు.