Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో మన వాళ్లకి కీలక పదవులు

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో మన వాళ్లకి కీలక పదవులు
, శనివారం, 14 సెప్టెంబరు 2019 (18:34 IST)
పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల్లో పలువురు మన తెలుగు ఎంపీలకు కీలక పదవులు లభించాయి. పలు శాఖలకు ఛైర్మన్‌ పదవులకు నియమితులయ్యారు. 

వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి, హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ ఆనంద్‌ శర్మ, ఆర్థిక స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ జయంత్‌ సిన్హా, మానవ వనరుల శాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ సత్యనారాయణ, జతీయ పరిశ్రమల స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ కే కేశవరావు, శాస్త్ర సాంకేతిక వ్యవహారాల స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ జయరామ్‌ రమేష్‌, రవాణా టూరిజం సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ టీజీ వెంకటేష్‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ రామ్‌ గోపాల్‌ యాదవ్‌, సిబ్బంది వ్యవహారాలు న్యాయశాఖ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ గా భూపేంద్ర యాదవ్‌, వ్యవసాయ శాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ జి. గౌడర్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ శశిథరూర్‌, రక్షణశాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ జువల్‌ ఓరం, విద్యుత్‌ శాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ సింగ్‌, పట్టణాభివృద్ధి శాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ జగదాంబికా పాల్‌, రైల్వేశాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ రాధావెూహన్‌ సింగ్‌, పెట్రోలియం నేచురల్‌ గ్యాస్‌ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ రమేష్‌ బి దూరి, కార్మిక శాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ భర్తృహరి మెహతాబ్‌, విదేశాంగశాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ పీపీ. చౌదరి, ఆహార వినియోగ దారుల వ్యవహారాలశాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ సుదీప్‌ బందోపాధ్యాయ, జలవనరుల శాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ సంజరు జైస్వాల్‌, కెమికల్‌ ఫర్టిలైజర్‌ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ కనిమొళి, గ్రావిూణాభివృద్ధి శాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ ప్రతాప్‌ జాదవ్‌, బొగ్గు ఉక్కు శాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ రాకేష్‌ సింగ్‌,సామాజిక న్యాయ శాఖ స్టాండింగ్‌ కమిటీఛైర్మన్‌ రమాదేవిలను నియమించారు.

కీలక పదవి విజయసాయికి వరించడంపై వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కాగా.. ఈ కమిటీలో మాగుంట శ్రీనివాసులురెడ్డి, నామా, కేశినేని నానిని సభ్యులుగా నియమిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. మొత్తానికి తెలుగు రాష్టాలకు చెందిన లోకసేభ, రాజ్యసభ సభ్యులకు ఢిల్లీలో కీలక పదవులు వరించడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రగతి భవన్‌లో కుక్క చనిపోతే డాక్టర్ మీద కేసు..జగ్గారెడ్డి