Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రాణం తీసిన బ్యానర్.. శుభశ్రీ కెనడా పోవాల్సింది.. ఇంతలో..

Advertiesment
roadside banner
, శనివారం, 14 సెప్టెంబరు 2019 (13:44 IST)
బ్యానర్లు, ఫ్లెక్సీలు అనుమతి లేకుండా ఏర్పాటు చేయకూడదని హెచ్చరికలు, ఆదేశాలు జారీ చేసినా లెక్క చేయట్లేదు. అలా నిబంధనలకు విరుద్ధంగా చెన్నైలో ఏర్పాటు చేసిన బ్యానర్ నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ బ్యానర్ ని అధికార పార్టీకి చెందిన అన్నాడీఎంకే నేత ఏర్పాటు చేశారు. 
 
తన కొడుకు పెళ్లి బ్యానర్ అక్కడ తగిలించారు. సమీపంలోని ఫంక్షన్ హాల్‌లో పెళ్లి జరుగుతోంది. దీంతో ఆయన రోడ్డు మీద బ్యానర్ ని ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. 
 
స్కూటర్‌ మీద బ్యానర్‌ పడడంతో బండి అదుపు తప్పింది. స్కూటర్‌ నుంచి కింద పడ్డ యువతిపై వెనుక నుంచి వచ్చిన వాటర్‌ ట్యాంకర్‌ వెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆమె స్పాట్ లోనే చనిపోయింది. చెన్నై, పల్లావరం రేడియల్ రోడ్డు సమీపంలో పళ్లికరణై దగ్గర ఈ ఘోరం జరిగింది. 
 
పెళ్లి ఆహ్వానం పేరుతో ఏర్పాటు చేసిన బ్యానర్‌ నేలకొరిగి స్కూటర్‌పై పడింది. దీంతో అదుపు తప్పి ఆ యువతి కూడా కింద పడింది. అదే సమయంలో వెనుక వైపు నుంచి వచ్చిన వాటర్ ట్యాంకర్ ఆమె మీదుగా వెళ్లడంతో మృతిచెందింది. ఎలాంటి అనుమతి లేకుండా బ్యానర్ ని ఏర్పాటు చేసినట్టు విచారణలో తేలింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.  
 
పోలీసులు వాటర్ ట్యాంకర్ డ్రైవర్ మనోజ్ యాదవ్(28)ని అరెస్ట్ చేశారు. ర్యాష్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నామని తప్పు చేసినట్టు తేలితే.. అన్నాడీఎంకే నేతపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 
 
పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన దారిలో సుమారు 50 బ్యానర్లు దారిపొడవునా ఉన్నాయి. అవన్నీ పర్మిషన్ లేకుండా పెట్టినవే. నేతలు తమ డబ్బు, అధికార బలంతో రూల్స్ కి విరుద్ధంగా వెళ్తున్నారు. 
 
శుభ్రశ్రీ మరికొన్ని రోజుల్లో కెనడా వెళ్లాల్సి ఉంది. అక్కడ కొత్త ఆఫీస్‌ పని చేయాల్సి ఉంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇంతలో శుభశ్రీకి ఇలా జరగడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు, కార్యాలయ సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరో చేసిన తప్పుకి శుభశ్రీ బలైందని కన్నీటిపర్యంతం అయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా పేరు స్టాలిన్ అనేసరికి.. వింతగా చూశారు.. భయపడ్డారు.. డీఎంకే చీఫ్