Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓటుకు నోటును త్వరగా తేల్చండి... సుప్రీం చెంతకు ఆర్కే

ఓటుకు నోటును త్వరగా తేల్చండి... సుప్రీం చెంతకు ఆర్కే
, మంగళవారం, 26 నవంబరు 2019 (16:49 IST)
తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయంగా సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ కేసులో వైయస్సార్ కాంగ్రెస్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) సుప్రీంకోర్టులో సోమవారం ఎర్లీ హియరింగ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. 
 
2017లోనే ఈ పిటిషన్ దాఖలు చేసినా సుప్రీంకోర్టులో లిఫ్టింగ్ కాకపోవడంతో ఆర్కే మరోసారి సుప్రీం తలుపుతట్టారు. తాజాగా 14 ఏళ్ల క్రితం స్టే విధించి చ్రందబాబుపైనే అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ స్టే ఎత్తివేసి విచారణ ప్రారంభించింది. ఇదే సరైన సమయంగా భావించి ఆర్కే పిటిషన్ దాఖలు చేసినట్లుగా చెబుతున్నారు. 
 
ఓటుకు నోటు వ్యవహారం ఇలా.. 
తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు వ్యవహారం కలకలమైంది. రాజకీయ కలవరానికి దారితీసింది. 2015లో టీడీపీ మహానాడు సమయంలో ఆనాడు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేయాలని కోరుతూ.. నాటి టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి తెలంగాణ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షల లంచం ఇవ్వటానికి ప్రయత్నించినట్లు వీడియో హల్‌చల్ చేశాయి.

అదేసమయంలో ఎపి సిఎం, టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు సైతం ఆయనతో ఫోన్‌లో మాట్లాడినట్లు వాయిస్ రికార్డులు బయల్పడ్డాయి. ఈ క్రమంలో రేవంత్‌ రెడ్డిని తెలంగాణ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తదనంతర పరిణామాల్లో ఓటుకు నోటు కేసు వ్యవహారాల్లో అనేకానేక ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఇప్పటికీ న్యాయపరంగా విచారణ కొనసాగుతూనే ఉంది. 
 
అప్పట్లోనే సుప్రీంకు వెళ్లిన ఆర్కే.. 
ఇదే కేసుకు సంబంధించి అప్పుడు సిఎంగా ఉన్న చ్రందబాబుపైనే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే సుప్రీంలో కేసు దాఖలు చేశారు. అందులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. ఛార్జిషీట్‌లో 52 సార్లు చ్రందబాబు పేరు ప్రస్తావించిన ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ల్లో మాత్రం చేర్చలేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలో వద్దో ఏసీబీ కోర్టు నిర్ణయిస్తుందంటూ ఆర్కే పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆయన సుప్రీంలో సవాల్ చేశారు. ఆర్కే పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు నోటీసులిచ్చినట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రి బొత్స సత్యనారాయణను బర్త్‌రఫ్‌ చేయాలి : పసుమర్తి అనురాధ