Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుమారం రేపుతున్న ఇసుక దందా... అసలు దొంగలు ఎవరు..?

దుమారం రేపుతున్న ఇసుక దందా... అసలు దొంగలు ఎవరు..?
, మంగళవారం, 19 నవంబరు 2019 (12:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక దందాలో ఏకంగా ముగ్గురు ఎంపీలు, 9 మంది మంత్రులు, 37 మంది ఎమ్మెల్యేలు ఇరుక్కున్నారు. స్పీకర్ తనయుడు తమ్మినేని చిరంజీవి పేరు అంటకాగుతోంది. మొత్తం 178 మంది అనుచరగణంతో ఈ అక్రమార్కులు రాచబాటలు వేసుకొంది. అసలు దొంగలు ఎవరు..? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అర్జీ పెట్టి చేసే వారు అధికారంలోకి రాగానే యధావిధిగా అదే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఇసుక వ్యాపారం గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో ముగ్గురు ఎంపీలు ఉండగా తొమ్మిది మంది మంత్రులు 37 మంది ఎమ్మెల్యేలకు భాగస్వామ్యం ఉందని వస్తున్న ఆరోపణలు ఆశ్చర్యం కలిగించే విషయం. ఇందులో ప్రత్యేకంగా స్పీకర్ కుమారుడుపై ఆరోపణలు వస్తున్నాయి. 
 
రాజమండ్రి ఎంపీ భరత్, బాపట్ల ఎంపీ నందిగామ సురేష్‌లపై ఆరోపణలు వస్తున్నాయి. ధర్మాన కృష్ణదాసు, తానేటి వనిత, కొడాలి నాని, మోపిదేవి వెంకటరమణ, మేకపాటి గౌతంరెడ్డి, రాజేంద్రప్రసాద్, శంకర్నారాయణ ఉన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్ కుమార్,  కొండేటి చిట్టిబాబు, జక్కంపూడి రాజాకు సంబంధించినటువంటి అనుచరగణం ఇసుక మాఫియా చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 
 
కర్నూల్ నుంచి ఎమ్మెల్యే రవి శంకర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీదేవి, సుధాకర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, అలాగే కాపు రామచంద్రారెడ్డి, ప్రకాష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. అనంతపురం జిల్లా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్యే రోజా.. వెంకటేష్ గౌడ్, భాస్కర్ రెడ్డి వారి అనుచరులు ఉన్నారు. 
 
ఇప్పుడు ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కృత్రిమ కొరత, అక్రమ రవాణా పై 14న విజయవాడలో చేపట్టిన దీక్షలో పాత్రికేయుల సమావేశంలో ఇసుక అక్రమ రవాణా... మాఫియా అంటూ వైసిపి నాయకుల పేర్లతో సహా... ఛార్జిషీట్ అంటూ.. జాబితాను విడుదల చేశారు. ఇందులో ఆయన ప్రత్యేకంగా వైకాపా నాయకులపైన విమర్శలు జోడిస్తూ సుమారుగా 178 మంది మీద ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు వైకాపా అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో చూద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#అంతర్జాతీయ పురుషుల దినోత్సవం.. ఎప్పుడు మొదలైందంటే?