Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వతహాగానే సింగపూర్ కంపెనీ తప్పుకుంది : మంత్రి బొత్స

Advertiesment
స్వతహాగానే సింగపూర్ కంపెనీ తప్పుకుంది : మంత్రి బొత్స
, సోమవారం, 18 నవంబరు 2019 (17:26 IST)
ప్రభుత్వం త్వరలోనే మార్కెట్ ఇంట్రవెన్షన్‌తో మార్క్ ఫెడ్ సెంటర్లు ఓపెన్ చేయబోతోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ, రైతులు ఆందోళన చెందవద్దు... దళారీలకు పంటను అమ్ముకోవాల్సిన అవసరం లేదు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైఎస్‌ జగన్‌ ఏలూరులో బిసి డిక్లరేషన్‌ చేశారు. తన పాదయాత్రలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని అన్నారు. ఎన్నికల మేనిఫేస్టోలో కూడా ఆ అంశాన్ని పొందుపరిచారు.
 
ప్రతి నామినేటెడ్ పదవుల్లో యాబై శాతం వారికి ఇస్తానని హామీ ఇచ్చారు. దీనిలో మహిళలకు పెద్దపీట వేస్తామని అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లోనూ దీనిని అమలు చేస్తున్నాం. అనంతపురం జిల్లాలో 13 మార్కెట్ కమిటీలు వున్నాయి, వీటితో పాటు మరో 3 కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంకు ఒక మార్కెట్ కమిటీ వుండాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. 16 ఎఎంసిల్లో 8 కమిటీలను ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
మొత్తం ఎఎంసిల్లో 8 కమిటీలను మహిళలకు కేటాయిస్తున్నాం. లాటరీ పద్దతిలో వీటిని ఎంపిక చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు గతంలో ఇంత పెద్ద ఎత్తున అవకాశాలు ఎప్పుడూ రాలేదు. రాబోయే కాలంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా... ఈ వ్యవస్థను అనుసరించాల్సిందే. అటువంటి అద్బుతమైన అవకాశాలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కల్పించింది. చట్టాలను చేయడం.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వాటిని అమలు.. అనేది ఒక చరిత్ర. ఇసుక వర్షాలు తగ్గడంతో సమస్య తీరిపోయింది. 
 
అనంతపుఉరం జిల్లాల్లో ఎక్కడికక్కడ ఇసుకను అందుబాటులోకి తెచ్చాం. ధరలను కూడా ఖరారు చేశాం.
 రోజురోజుకూ ఇసుక సరఫరాను మెరుగుపరుచుకుంటున్నాం. అనంతపురం జిల్లాలో రాబోయే రెండు రోజుల్లో మరింత ఇసుక అందుబాటులోకి వస్తుంది. రాజధాని స్టార్టప్‌ ఏరియా డెవలప్‌‌మెంట్ నుంచి సింగపూర్‌ కంపెనీ వైదొలిగింది.
 పరస్పర ఒప్పందంతో స్టార్టప్‌ నుంచివైదొలుగుతున్నామని సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ప్రకటించారు. అదే క్రమంలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా వున్నామని అన్నారు. 
 
ఈ ప్రభుత్వంతో మాకు సానుకూలత వుందని కూడా చెప్పారు. స్టార్టప్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ను స్విస్ ఛాలెంజ్ ద్వారా కట్టబెట్టారు. అదే క్రమంలో స్విస్ ఛాలెంజ్ లోపభూయిష్టమని కేంద్రం వేసిన కేల్కర్ కమిటీ చెప్పింది. న్యాయస్థానాలు కూడా దీనిని తప్పుపట్టాయి. అయినా కూడా చంద్రబాబు ప్రభుత్వం దానిని పెడచెవిన పెట్టింది. మా ప్రభుత్వం స్టార్టప్‌ ఏరియాను ఎలా అభివృద్ది చేస్తుందో చెప్పాలని సింగపూర్‌ కంపెనీని అనేక సార్లు కోరింది.
 
దీనిపై సదరు సంస్థ మాకు వారి ప్రణాళికను విశదీకరించలేక పోయింది. స్టార్టప్‌ నుంచి వైదొలుగుతున్నామని స్పష్టం చేసింది. దీనికి బదులు ఇంకా పెట్టుబడులు పెడతాం... మీతో కంటిన్యూ అవుతామని సంసిద్దత వ్యక్తం చేసింది.
 పాత ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలను గురించి చెప్పలేమని సింగపూర్‌ ప్రభుత్వం చెప్పింది. ఈ వాస్తవాలను పక్కకు పెట్టి టిడిపి నేతలు రాజకీయం చేస్తున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని ఆరోపణలు చేస్తున్నాయి. 
 
పెట్టుబడుల పేరుతో వారు చేసిన అవినీతి విధానాలను ఈ ప్రభుత్వం అంగీకరించదు. పెట్టుబడుల రూపంలో అవినీతిని ఈ ప్రభుత్వం ప్రోత్సహించదు.  ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని తిరోగమనంలో తీసుకువెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. రైతులకు మేలు చేసే ప్రయత్నాలను, కొత్తగా ఉద్యోగాల కల్పనను కూడా తప్పుపడుతున్నారు. రాష్ట్రంలో 1.40 లక్షల మందికి ఒకేసారి వార్డు, సచివాలయ ఉద్యోగాలను కల్పించాం. నిరుద్యోగ సమస్యను తీర్చడంతో పాటు ప్రజల వద్దకు పాలనను తీసుకువచ్చే నిర్ణయం.
 
దీనిని కూడా తమ అనుకూల పత్రికల్లో నాలుగు రోజుల పాటు నానా యాగీ చేయించారు. అవకాశాలు పొందిన వారు బహిరంగంగా చెప్పిన మాటలతో టిడిపి నేతలు తలదించుకున్నారు. ప్రజల నుంచి సానుకూలత, నిరుద్యోగ యువత నుంచి ప్రభుత్వానికి మద్దతు రావడంతో వెనకడుగు వేశారు. రైతు భరోసా పైనా ఇలాగే దుష్ర్పచారం. కేంద్రం ఇచ్చే దానితో కలిపి ఇస్తామని మేం ముందునుంచే చెబుతున్నాం. రైతులు, కౌలురైతుల నుంచి మాకు ఎంతో అభినందనలు వచ్చాయి. దీనితో టిడిపి నేతలు మౌనం వహించాల్సి వచ్చింది.
 
మహిళా గ్రూపుల్లో రికార్డులు రాసే వారికి రూ.2 వేలు పారితోషికం ఇచ్చేవారు. వారికి చంద్రబాబు మరో రూ.3 వేలు కలపి రూ.5 వేలు జీతం అంటూ ప్రకటించారు. కానీ దానిని ఇవ్వడం మానివేశారు. దీనితో మహిళా గ్రూపులే తమ పొదుపు డబ్బుల నుంచే వారికి అయిదు వేలు చెల్లించారు. ఈ సమస్యపై పాదయాత్రలో వైఎస్‌ జగన్‌‌ను మహిళా సంఘాలు కలిసాయి. మాలో గ్రూప్ లీడర్‌తో పనిచేయించుకుంటాం... జీతం పెంచాలని కోరాయి. వారికి పదివేల రూపాయలు ఇస్తానని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. దానిని అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్నారు. 
ప్రతి 3 సంవత్సరాలకు ఒక లీడర్‌ను వారిలోనే ఒకరిని మార్చుకోవాలని సూచించారు. మహిళల్లో నాయకత్వ పటిమను పెంచాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ద్యావుడా, దోమ తెరల వెనుకాల కోట్ల రూపాయల కట్టలు, ఎక్కడ?