సెక్సీయస్ట్ ప్రభాస్... ఆసియా అత్యంత శృంగార పురుషుడు

గురువారం, 5 డిశెంబరు 2019 (21:38 IST)
'బాహుబలి' చిత్రంతో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన టాలీవుడ్ హీరో ప్రభాస్. 'బాహుబలి' చిత్రం తర్వాత వచ్చిన సాహో ఆయన్ను పూర్తిగా నిరాశపరిచింది. కలెక్షన్లపరంగా ఈ చిత్రం సూపర్ అయినప్పటికీ... ప్రభాస్ అభిమానులను ఆశించిన స్థాయిలో ఆలరించలేకపోయింది. దీంతో ప్రభాస్ ఒకింత నిరుత్సాహానికి లోనయ్యారు. 
 
ఇదిలావుంటే, తాజాగా, ప్రభాస్‌కు అభిమానులు ఆసియా అత్యంత శృంగార పురుషుల జాబితాలో 10వ స్థానం కట్టబెట్టారు. బ్రిటీష్ న్యూస్ వీక్లీ, ఈస్ట్రన్ ఐ సంస్థలు నిర్వహించిన సర్వేలో ప్రభాస్‌కు భారీగా ఓట్లు పోలయ్యాయి. ఆసియా అత్యంత శృంగార పురుషుడు-2019 పేరిట ఆన్‌లైన్‌లో సర్వే నిర్వహించారు. ఈ ఫలితాలను తాజాగా వెల్లడించారు.
 
ఈ సర్వే ఫలితాల్లో లిస్టులో బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ మొదటిస్థానంలో నిలిచాడు. టాప్-5లో ఆ తర్వాతి స్థానాల్లో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, టీవీ నటుడు వివియన్ డిసేనా, బాలీవుడ్ యువ కథానాయకుడు టైగర్ ష్రాఫ్, బ్రిటీష్ ఏషియన్ పాప్ స్టార్ జయన్ మాలిక్ నిలిచారు. ఇక సినిమాలకు సంబంధించిన ప్రముఖులే ఎక్కువగా ఉన్న టాప్-10లో ఉన్న ఏకైక క్రీడాకారుడు విరాట్ కోహ్లీనే. కోహ్లీకి 7వ స్థానం లభించింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సారీ ఇప్పుడు చేయలేను: పూజా హెగ్డే, ఏంటి?