Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్ర‌భాస్.. నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్

Advertiesment
ప్ర‌భాస్.. నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్
, శుక్రవారం, 1 నవంబరు 2019 (17:37 IST)
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ‌తో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది. గోపీకృష్ణా మూవీస్ సమ‌ర్ప‌ణ‌లో యు.వి. క్రియేష‌న్స్ సంస్థ ఈ సినిమాని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. దీనికి జాను అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. న‌వంబ‌ర్ నుంచి తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. 
 
అయితే... ప్ర‌భాస్ త‌దుప‌రి చిత్రాలకు సంబంధించి క‌థ‌లు వింటున్నాడు. రీసెంట్‌గా సైరా సురేంద‌ర్ రెడ్డి ప్ర‌భాస్‌కి ఓ క‌థ చెప్పాడ‌ట‌. ఈ క‌థ ప్ర‌భాస్‌కి న‌చ్చింద‌ని ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయ‌మ‌ని చెప్పాడ‌ని తెలిసింది. ప్ర‌భాస్ పైన ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఒత్తిడి పెంచుతున్నారు అని ఫిల్మ్ న‌గ‌ర్‌లో టాక్ వినిపిస్తోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... ప్ర‌భాస్‌తో దిల్ రాజు మున్నా, మిస్ట‌ర్ పర్ఫెక్ట్ చిత్రాల‌ను నిర్మించారు.
 
ఇప్పుడు ఓ భారీ చిత్రాన్ని నిర్మించాలి అనుకుంటున్నాడ‌ట‌. బాహుబ‌లి రిలీజ్ త‌ర్వాత నుంచి ప్ర‌భాస్‌తో సినిమా చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాడ‌ట కానీ.. ప్ర‌భాస్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాలేదట‌. అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగితే.. ప్ర‌భాస్ - సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్లో రూపొందే ఈ భారీ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించ‌నున్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ పైన క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ యాసలో చైతూ స్పీచ్.. ఫిదా సీన్ రిపీట్.. మరి సాయిపల్లవి?