Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25 లక్షల ఒంటరి తల్లులు తెలంగాణలో.. వారి మగబిడ్డలు రోడ్లపైన, వాళ్లేం చేస్తున్నారు?

Advertiesment
25 లక్షల ఒంటరి తల్లులు తెలంగాణలో.. వారి మగబిడ్డలు రోడ్లపైన, వాళ్లేం చేస్తున్నారు?
, బుధవారం, 4 డిశెంబరు 2019 (18:54 IST)
దిశపై అత్యాచారం, హత్యపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అసలు ఇలాంటి దారుణాలు, అత్యాచారాలు ఎందుకు జరుగుతన్నాయనే దానిపై ఓ సీనియర్ జర్నలిస్ట్ వెల్లడించిన వివరాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది ఒంటరి తల్లులు(మహిళలు) తమ కుటుంబాన్ని ఈడ్చుకొస్తున్నారనీ, వీరంతా తమ పిల్లల కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారంటూ చెప్పుకొచ్చారు.
 
తమ పిల్లలని బతికించడానికే ప్రతి తల్లి తాపత్రయ పడుతోంది, కానీ తన పిల్లవాడు ఎలా బతుకుతున్నాడో తెలియదు. వాళ్లంతా రోడ్లపై వుంటారు. మొబైల్ ఫోన్లు చూస్తారు. పోర్న్ వీడియోలు చూస్తున్నారు. చదువు లేదు. చేసేందుకు సరైన పని వుండదు. ఫ్రస్టేషన్, పేదరికం, పనిలేదు. దీనితో వారంతా క్రూరులుగా తయారవుతున్నారు.
 
ఇలాంటివారు తెలంగాణలోనే కాదు, దేశంలోనూ వున్నారు. వీళ్లకు అత్యాచారం చేసే అవకాశం వుంటే ఖచ్చితంగా చేస్తారు. ప్రభుత్వ వ్యవస్థలు సరిగా పనిచేయనందునే ఇలాంటివారు తయారవుతున్నారు. అన్ని వ్యవస్థలు సవ్యంగా పనిచేస్తే ఇలాంటి ఘాతుకాలు జరిగే అవకాశం వుండదు.

పనిలేకుండా, రోడ్లపై తిరిగే యువకులపై ప్రభుత్వాలు దృష్టి పెట్టడంలేదు. వాళ్లంతా అనేక వ్యసనాలకు బానిసలవుతున్నారు. మద్యాన్ని సేవిస్తున్నారు. ఆ తర్వాత తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. వీటన్నిటినీ ఆపాల్సిన బాధ్యత వ్యవస్థలదే. అవన్నీ సక్రమంగా పనిచేస్తే ఈ దారుణాలు ఆగుతాయి.
 
100కి డయల్ చేయమంటున్నారు. ఆ నెంబరికి డయల్ చేస్తే, మీరెవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? వంటి తదితర ప్రశ్నలు వేసి సమయం తీసుకుంటారు. కానీ ఆపదలో వున్న అమ్మాయికి అవన్నీ చెప్పే అవకాశం వుంటుందా? ఆపదలో వున్నానని చెప్పగానే, బాధితులు ఎక్కడ నుంచి చేశారో ఆ లొకేషన్‌కి పోలీసులు హుటాహుటిన వెళ్లాలి. ఆ పరిస్థితి వుందా అని ఆమె ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు తల్లి గీతాలాపన రద్దు? వైకాపా పాటలు పెట్టేశారా? నారా లోకేశ్