Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డాలస్ వేదికగా నాట్స్ బాలల సంబరాలు: చిన్నారుల సృజనకు పదునుపెట్టేలా పోటీలు

డాలస్ వేదికగా నాట్స్ బాలల సంబరాలు: చిన్నారుల సృజనకు పదునుపెట్టేలా పోటీలు
, సోమవారం, 2 డిశెంబరు 2019 (20:05 IST)
డాలస్: అమెరికాలో తెలుగుజాతికి తమ విశిష్ట సేవలతో దగ్గరైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) వారి డాలస్ చాప్టర్, వరుసగా తొమ్మిదవ సంవత్సరం బాలల సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించింది. డాలస్‌లోని కూడి అకాడమీ ఆడిటోరియం వేదికగా జరిగిన ఈ బాలల సంబరాల్లో వందలాది చిన్నారులు తమ ప్రతిభ చూపారు. దాదాపు పన్నెండు గంటల పాటు జరిగిన ఈ సంబరాలలో భారత దేశ సంస్కృతిని, పిల్లలలోని మేధస్సును ప్రోత్సహించే దిశగా పోటీలు నిర్వహించడం జరిగింది. 
webdunia
ఈ కార్యక్రమంలో 150 మంది బాల బాలికలు గణితం, చదరంగం మరియు తెలుగు పదకేళి పోటీలలో ఎంతో ఉత్సాహాంతో పాల్గొన్నారు. ఎలిమెంటరీ, మిడిల్ స్కూల్, సీనియర్ స్కూల్ పిల్లలకు విడిగా నిర్వహించిన ఈ పోటీల్లో పిల్లలు తమ ప్రతిభను చాటారు.
webdunia
సాఫ్ట్ స్కూల్స్ తరఫున గూడవల్లి మణిధర్ పిల్లలకు గణితంలో పోటీ పరీక్షలు నిర్వహించారు. USCF స్థానిక చాఫ్టర్ సహకారంతో నిర్వహించిన చదరంగం పోటీలో 90 మంది పిల్లలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మొదటి రెండు లేదా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నాట్స్ డాలస్ చాప్టర్ బహుమతులు అందించింది. 
 
విద్యార్ధుల్లో సృజనాత్మకతను పెంచేందుకు వారిని ప్రోత్సాహించేందుకు నాట్స్ బాలల సంబరాలు నిర్వహిస్తుందని నాట్స్ ఉపాధ్యక్షులు శేఖర్ అన్నే ఆన్నారు.నాట్స్ చేసే వివిధ సేవా కార్యక్రమాల గురించి వివరించి అందరిని భాగస్వామ్యులు కావాల్సిందిగా కోరారు. ఇతర వక్తలు మాట్లాడుతూ ప్రవాసాంద్రుల పిల్లల కొరకు నాట్స్ చేస్తున్ని సేవలను ప్రశంసించారు. 
 
ఈ బాలల సంబరాలు కార్యక్రమానికి ముఖ్య నిర్వాహకులుగా డాలస్ చాప్టర్ కార్యదరి అశోక్ గుత్తా,కిషోర్ వీరగంధం వ్యవహరించారు. డాలస్ చాప్టర్ కార్యవర్గ సభ్యులు నాగిరెడ్డి మండల, ప్రేమ్ కలిదిండి ,భాను లంక, కృష్ణ వల్లపరెడ్డి,శ్రీధర్ న్యాలమడుగుల, కిరణ్ జాలాది, దేవీప్రసాద్, విజయ్ కొండా, వెంకట్ పోలినీడు,వెంకట్ కొయలమూడి ఇతరులు పూర్తి సహయ సహకారాలు అందించి తోడ్పడ్డారు. ఇంకా ఈ కార్య క్రమంలో నాట్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ కిషోర్ కంచర్ల, రాజేంద్ర మాదాల, ఆది గెల్లి, జాతీయ కార్యవర్గ సభ్యులు బాపు నూతి, శేఖర్ అన్నే, కిషోర్ వీరగంధం, జ్యోతి వనం పాల్గొని వారి తోడ్పాటుని అందించారు. 
webdunia
స్థానిక సాఫ్ట్ స్కూల్స్.కామ్, స్పా ర్కల్స్ మరియు బావార్చి బిర్యానీ పాయింట్ ఈ కార్యక్రమ నిర్వహణకు తమ సహాయాన్ని అందించారు, స్థానిక సంస్థలు ఈ కార్యక్రమానికి తమ వంతు సహాకారాన్ని అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శృంగారంలో వచ్చే అలసటను పోగెట్టే ఉసిరి, ఎలాగంటే?