Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోవా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్లో స‌త్తా చాటిన తెలుగోడు దేవ్ పిన్

Advertiesment
గోవా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్లో స‌త్తా చాటిన తెలుగోడు దేవ్ పిన్
, శనివారం, 23 నవంబరు 2019 (21:01 IST)
ప్రపంచంలోనే అతి పెద్ద మానవ సంక్షోభం సిరియాలోనే 2011 నుండి 2018 వరకు జరిగింది. ఈ మారణ హోమంలో ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో చాలామంది చిన్నపిల్లలు కూడా వున్నారు. దీనికి మూల కారణం నాయకుల యొక్క అహం, స్వార్ధం, అధికారం కోసం అత్యాశ కోసం జరిగిన ఈ సంఘటనలో దేశం మొత్తం నాశనం అయ్యింది.

ఈ మారణ హోమంలో శిధిలాల మధ్య దొరికిన ఒక ఐదేళ్ళ పిల్లవాడిని హాస్పిటల్ తీసుకునివెళితే అతను చనిపోయే ముందు చివరి పరిస్థితిల్లో చెప్పిన మాటలు i'm gonna tell god everything. ఆ పిల్లవాడి మాటల ఉద్దేశం ఆధారంగా అరబిక్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో హాలివుడ్‌లోని సిరియన్ యాక్టర్స్‌తో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ షార్ట్ ఫిల్మ్ ప్రాజెక్ట్ తెరకెక్కించడం జరిగింది.
 
ఈ షార్ట్ ఫిల్మ్ పోస్టర్‌ని ముంబాయిలో బాలివుడ్ యాక్టర్ సంజయ్ దత్ లాంచ్ చేశారు. వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్ అవార్డులు వచ్చాయి, అలాగే నార్వే ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం అవార్డు అందుకుంది. ఇప్పుడు గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రత్యేకమైనది. ఆసియాలొ కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇంటర్నేషనల్ సెక్షన్లో మన తెలుగువాడు చేసిన ఫిల్మ్ సెలెక్ట్ అయ్యింది.
 
గోవా ఫిల్మ్ ఫెస్టివల్ అనేది షార్ట్ ఫిల్మ్స్‌కి ప్రాముఖ్యత ఇవ్వరు, కేవలం ఆస్కార్‌కి నామినేట్ అయ్యే ఫిల్మ్స్, ఆస్కార్ అవార్డ్స్ వచ్చే ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్‌కి మాత్రమే ఎక్కువగా ప్రాధ్యానత ఇస్తారు. మొట్టమొదటిసారిగా గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ షార్ట్ ఫిల్మ్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ జరుపుకుంది. ఇండియన్ ఫిలిమ్స్‌కి ప్రత్యేకంగా ఇండియన్ పనోరామ అనే ఒక సెక్షన్ వుంది. దానిలో మన దేశంలో గొప్ప సినిమాలు సెలెక్ట్ అవుతాయి.
 
ఈ షార్ట్ ఫిల్మ్‌లో నటించిన ఐదేళ్ళ పిల్లాడు క్యారెక్టర్ చేసిన VIVAAN BISOI ఇండియాకి చెందినవాడు కావడం విశేషం. అంతేకాకుండా ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ Dev Pinn (వాసు దేవ్), కెమెరామెన్ హరి వేదాంతం కూడ ఇండియాకి చెందినవారు అవ్వడం విశేషం. గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో తెలుగు ఇండస్ట్రీ  నుంచి F2 సినిమా ఒక్కటే ఇండియన్ పరోనామా కమర్షియల్ క్యాటగిరిలో సెలెక్ట్ అయ్యింది, దాని తర్వాత ఇంటర్నేషనల్ సెక్షన్లో ఇండియా నుంచి సెలెక్ట్ అయిన ఏకైక షార్ట్ ఫిల్మ్ i'm gonna tell god everything.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీదేవి భర్తతో పూజాహెగ్దేకేం పని?