Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటిగా మారిన డిప్యూటీ సిఎం...

Advertiesment
నటిగా మారిన డిప్యూటీ సిఎం...
, శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (21:45 IST)
రాజకీయాల్లో ఆమె స్టైలే సపరేటు. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో అనతికాలంలో ఎదిగి ఏకంగా ఉపముఖ్యమంత్రి అయ్యారు. సమాజంలో మార్పు తీసుకువచ్చే దిశగా తన ప్రయత్నం కొనసాగిస్తున్నారు. అలాంటి ఉపముఖ్యమంత్రి ఏకంగా ఒక నటిగా మారడం ఇప్పుడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతోంది. ఇంతకీ ఎవరా ఉపముఖ్యమంత్రి. 
 
పాముల పుష్పశ్రీవాణి. డిప్యూటీ  సిఎం. విజయనగరం జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలో మేథ్స్ టీచర్ ఆమె. మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు కుమారుడు పరీక్షిత్ రాజును వివాహం చేసుకున్నారు. ఎన్నికల్లో శత్రుచర్ల కుటుంబ తరపున ఆమెను నిలబట్టారు. ఆమె విజయం సాధించారు. కొన్నిరోజుల్లోనే రాజకీయాలను అలవాటు చేసుకున్న పుష్పలత.. తనదైన శైలిలో నియోజకవర్గ ప్రజల్లో మమేకం అవుతున్నారు.
 
సాధారణంగా ఉపముఖ్యమంత్రి అంటే ఏ సినిమాల్లోను నటించరు. కానీ ఆమె మాత్రం అందుకు భిన్నం. అది కూడా సామాజిక చైతన్యం కలిగించే వ్యవసాయం గురించి రైతుకు వివరించే షార్ట్ ఫిల్మ్‌లో నటించాలని ఉపముఖ్యమంత్రిని కోరారు ఒక షార్ట్ ఫిల్మ్ సంస్ధ. తన గ్రామంలో ఆ షూటింగ్ నిర్వహిస్తామని చెప్పారు. దీంతో ఆమె ఒప్పుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫుల్ జోష్‌లో జగన్ సర్కార్.. ఎలా?