నాజూకు నడుముతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది పూజా హెగ్డే. హీరోల కన్నా హీరోయిన్‌గా పూజా హెగ్డే ఉందంటే చాలు థియేటర్ ముందు అభిమానులు బారులు తీరుతున్నారు. అయితే గత సంవత్సరం తెలుగులో వరుసపెట్టి సినిమాలు చేసినా ఇప్పుడు మాత్రం కాస్త వెనకబడింది పూజ.
బాలీవుడ్ వైపు ఎక్కువగా దృష్టి పెట్టడమే ఇందుకు కారణమంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే పూజా హెగ్డేకి విజయం వరించినా కాలం మాత్రం కలిసి రావడం లేదని ఆమె స్నేహితులే చెప్పుకుంటున్నారు. ప్రస్తుతాఇకి పూజా చేతిలో అన్ని భాషలలో కలిపి రెండుమూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి.
వీటి షూటింగ్ అయిపోతే పూజా ఫ్రీ అయిపోతుంది. ఇలాంటి సమయంలో పూజా హెగ్డే బోనీ కపూర్‌తో భేటీ అయ్యిందట. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. బోనీ కపూర్ సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా వరుస పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఆయన సినిమాల్లో అవకాశం కోసమే పూజా ఆయన్ని కలిసిందని కొందరు అంటుంటే బోనీ కపూరే పూజని కలిశారని అభిమానులు ప్రచారం చేస్తున్నారు. మరి ఇందులో నిజమేదో?