Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 31 March 2025
webdunia

టెంపాలో నాట్స్ ఫుడ్ డ్రైవ్‌కు విశేష స్పందన

Advertiesment
NATs
, శుక్రవారం, 29 నవంబరు 2019 (19:35 IST)
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకొచ్చిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్... తన  సేవాపథంలో భాగంగా టెంపాలో క్యాన్డ్‌ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. అన్నార్తుల ఆకలి తీర్చే లక్ష్యంతో చేపట్టిన ఈ ఫుడ్ డ్రైవ్‌కు స్థానిక తెలుగువారి నుంచి విశేష స్పందన లభించింది. రెండు వారాల సమయంలోనే  1000 ఎల్.బిల ఫుడ్ క్యాన్స్‌ను తెలుగువారు విరాళంగా అందించారు.. ఇలా విరాళంగా సేకరించిన ఫుడ్ క్యాన్స్‌ను స్థానిక ఫీడింగ్ అమెరికా టెంపా డౌన్ టౌన్‌కు నాట్స్ నాయకత్వ బృందం అందించింది. 
 
పేదలకు ఉచితంగా ఫీడింగ్ టెంపాబే సంస్థ ఆహారాన్ని అందిస్తుంది. నాట్స్ చేపట్టిన ఈ ఫుడ్ డ్రైవ్ పైన ఫీడింగ్ టెంపాబే సంస్థ ప్రశంసల వర్షం కురిపించింది. పేదలకు ఆకలి తీర్చడంలో నాట్స్ కూడా తన వంతు పాత్ర పోషించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపింది.. నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ జాతీయ నాయకులు ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్  టెంపాబే చాప్టర్ కో-ఆర్డినేటర్ రాజేశ్ కాండ్రులు ఫుడ్ క్యాన్స్‌ను ఫీడింగ్ టెంపాబే సంస్థకు అందించడంతో పాటు అమెరికాలో నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. 
 
ఈ ఫుడ్ డ్రైవ్ విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ అచ్చి, శ్రీనివాస్ బైరెడ్డి, సతీశ్ పాలకుర్తి, శ్రీథర్ గౌరవెల్లి, శ్రీనివాస్ మల్లాది, ప్రసాద్ కొసరాజు, సుథీర్ మిక్కిలినేని,రమ కామిశెట్టి తదితరులను నాట్స్ ప్రత్యేకంగా అభినందించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దయచేసి మీ దేహంపై దయ చూపండి!!