Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

శీతాకాలంలో ఆస్తమా హల్చల్, వదిలించుకునేందుకు ఇది చేస్తే?

Advertiesment
Asthma
, మంగళవారం, 12 నవంబరు 2019 (21:48 IST)
శీతాకాలం ప్రారంభం కాగానే చాలామంది ఆస్తమా సమస్యతో బాధపడతారు. గొంతులో గురగురమంటూ పిల్లికూతలు వినిపిస్తుంటాయి. ఇక శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటివారు చికిత్స తీసుకుంటేనే కొన్ని వ్యాయామ పద్ధతలు పాటిస్తే సమస్యను అధిగమించవచ్చు.
 
వీటిలో బాగా మేలు చేసేది ఉష్ట్రాసనం. ఉష్ట్రం అనే పదానికి ఒంటె అని అర్థం. అందుకనే ఈ భంగిమతో కూడిన వ్యాయామరీతిని ఒంటె భంగిమ అని పిలుస్తున్నారు. ఒంటె భంగిమ అనేది శర భంగిమ (ధనురాసన)కు ఊర్ధ్వ శర భంగిమ (ఊర్ధ్వ ధనురాసన)కు మధ్యస్థంగా ఉంటుంది. మోకాళ్ల వద్ద కాళ్లను వంచి ఆరు అంగుళాల దూరంలో వాటిని ఉంచండి. కాలివేళ్లు, మడమల వంపు ఆధారంగా కూర్చొనండి. నడుము కింది భాగంలో వీలైనంత వెడల్పుగా ఉంచండి. శరీరం, వెన్నెముక, మెడ సమాంతరంగా ఉంచాలి. అరచేతులను సంబంధిత మోకాళ్ల మీద ఆనించాలి. 
 
మోకాళ్లమీద శరీరాన్ని వెనుకకు వంచి కుడి మడమను మీ కుడి చేతితోనూ, ఎడమ మడమను ఎడమ చేతితోనూ పట్టుకోవాలి.మడమలను గట్టిగా పట్టుకుని నడుము మరియు తొడలను వెనక్కు వంచాలి. తలను, మెడను వీలైనంతగా వెనక్కు వంచాలి. కటి భాగాన్ని, నడుమును కొద్దిగా ముందుకు నెట్టాలి. శ్వాసను మామూలుగా పీల్చి వదులుతూ ఈ స్థితిలో 6-8 సెకన్ల వరకు అలాగే ఉండిపోవాలి. తర్వాత ఈ స్థితినుంచి బయటకు వచ్చి మామూలు పొజిషన్‌కి వెళ్లండి. ఇలా చేస్తున్నప్పుడు ముందుగా చేతులను సడలించి పొజిషన్లో శరీరాన్ని గట్టిగా ఉంచండి.
 
ప్రయోజనాలు-
మడమలు, తొడలు, శరీరం, ఛాతీ, గొంతు, కటి, పొత్తి కడుపులను దృఢంగా ఉంచడానికి ఈ భంగిమ చాలా మంచింది. ఇది మెడ, పొత్తికడుపు అంగాలను నియంత్రిస్తుంది. ఈ భంగిమ ఉబ్బసం దుష్ప్రభావాలను తొలగించి, శ్వాస కోశాలను, ఊపిరితిత్తుల పనితీరును, ముక్కు నాళికను, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. పదే పదే వచ్చే తలనొప్పి, గొంతు సమస్యలు, టాన్సిల్స్‌ను నివారిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్యూమినియం పాత్రల్ని అస్సలు వాడకూడదట.. (video)