Publish Date: Sat, 30 Nov 2019 (19:47 IST)
Updated Date: Sat, 30 Nov 2019 (19:49 IST)
ఉసిరికాయలో ఎన్నో ఆరోగ్య విలువలు, ఔషధ లక్షణాలు ఉన్నాయన్న విషయం మన అందరికి తెలిసిందే. ముఖ్యంగా శృంగార సమస్యలతో బాధపడేవారు ఉసిరికాయను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉసిరికాయలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
1. పుల్లపుల్లగా వగరుగా ఉండే ఈ ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉన్నాయి. యాపిల్‌తో పోలిస్తే ఇందులో మూడు రెట్లు ప్రోటీన్లు ఉన్నాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
2. దానిమ్మ పండుతో పోలిస్తే దాదాపు 27 రెట్లకు పైగా ఉసిరిలో పోషకాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
3. ఉసిరిలో యాంటీవైరల్, యాంటీమాక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఉసిరికాయ రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.
4. శృంగార సామర్ధ్యం పెంపొందించడంలో ఉసిరి కీలక పాత్రను పోషిస్తుంది. ఆ సమయంలో వచ్చే అలసటను దూరం చేస్తుంది.
5. ఉసిరికాయ హృద్రోగం, మధుమేహం రాకుండా కాపాడుతుంది. మెదడు పనితీరు మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఉసిరిలో ఉన్న విటమిన్ సి శరీరాన్ని ఎండ వేడి నుంచి కాపాడుతుంది.
6. జుట్టుకు సరైన పోషణను అందిస్తుంది. చుండ్రు కేశ సంబంధిత అనేక సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.
7. ఉసిరిని తీసుకోవడం వల్ల చర్మంపై మచ్చలను, వయసు మీద పడటం వల్ల వచ్చే ముడతలను నివారించుకోవచ్చు.