Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దిశ కేసులో కీలక పరిణామం... ఇక నిందితులు రోజులు లెక్కించుకోవాల్సిందే...

Advertiesment
దిశ కేసులో కీలక పరిణామం... ఇక నిందితులు రోజులు లెక్కించుకోవాల్సిందే...
, బుధవారం, 4 డిశెంబరు 2019 (18:32 IST)
హైదరాబాద్ నగరంలో పశువైద్యురాలు దిశ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టు అయిన నలుగురు నిందితులకు సత్వరం శిక్ష పడాలని డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇందులోభాగంగా, ఈ కేసు విచారమ నిమిత్తం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటును ఏర్పాటు చేయాల్సిందిగా హైకోర్టులో ప్రభుత్వం తరపున పిటిషన్ దాఖలు కావడం, దానికి కోర్టు అనుమతించడం చకచకా జరిగిపోయింది. 
 
హైకోర్టు స్పందన నేపథ్యంలో రాష్ట్ర న్యాయశాఖ దీనిపై కసరత్తు చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టును మహబూబ్ నగర్‌లో ఉర్పాటు చేసేందుకు కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు నేపథ్యంలో, ఈ కేసు విచారణ త్వరితగతిన సాగనుంది. రోజువారీ విచారణ జరిపి, నిందితులకు త్వరగా శిక్షపడేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇటీవల వరంగల్‌లో ఓ బాలిక హత్య ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయగా... కేవలం 56 రోజుల్లోనే విచారణ పూర్తై, తీర్పు వెలువడిన విషయం తెల్సిందే. వీరికి శిక్షను అమలు చేయాల్సివుంది. 
 
ఇదిలావుంటే, దిశ హత్య కేసులోని నిందితుల వద్ద విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నలుగురు నిందితులను వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సమ్మతించింది. దీంతో ఈ నలుగురు నిందితులను పోలీసులు వారం రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. మరోవైపు, ఈ నలుగురు నిందితులను మంగళవారం కోర్టులో హాజరుపరచగా, వారిపై స్థానికులు చెప్పులు విసిరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిడిపిని ఎందుకు తిట్టడం లేదో చెప్పేసిన పవన్ కళ్యాణ్