Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పురుషుడుగా మారిన లేడీ కానిస్టేబుల్.. ఆపై మనసుపడిన యువతితో వివాహం

పురుషుడుగా మారిన లేడీ కానిస్టేబుల్.. ఆపై మనసుపడిన యువతితో వివాహం
, బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (14:44 IST)
ఓ లేడీ కానిస్టేబుల్ ఓ యువతిపై మోజుపడింది. ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని భావించింది. కానీ, తామిద్దరం స్త్రీజాతికి చెందినవాళ్లం కావడంతో ఓ కొత్త ఎత్తుగడ వేసింది. తాను పురుషుడుగా మారాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ లేడీ కానిస్టేబుల్ కాస్త.. పురుషుడుగా మారిపోయింది. లింగమార్పిడి చేసుకోవడంతో తన కలను సాఫల్యం చేసుకుంది. ఆ తర్వాత తాను ఇష్టపడిన యువతిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. ఈ వివాహం కూడా ఈ నెల 16వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహం మహారాష్ట్రలో జరిగింది. లింగ మార్పిడి చేయించుకున్న లేడీ కానిస్టేబుల్ బేరు లలిత్ అలియాస్ లలిత్ సాల్వే. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మహారాష్ట్ర బీడ్ జిల్లా మజల్ గావ్ మండలం రాజేగామ్ గ్రామంలో 1988 జూన్‌లో లలితా కుమారి సాల్వేగా పుట్టిన ఆమె నాలుగేళ్ల క్రితం తన శరీరంలో వచ్చిన మార్పులు గమనించింది. దీంతో ఆమె వైద్య పరీక్షలు చేయించుకుంది. అప్పటికే కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న లలితా కుమారి సాల్వే తన శరీరంలో వచ్చిన మార్పులకు ఆందోళన చెందింది.
 
సాల్వే పోలీసు దళంలో విధుల్ని కొనసాగిస్తూ వస్తూన్న క్రమంలో ఆమెలో వచ్చిన మార్పుల రీత్యా ఆమె ఉద్యోగానికి ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆమె లింగ మార్పిడి చేయించుకోవాలని నిర్ణయించుకుంది. దీనికి ఉన్నతాధికుల పర్మిషన్ కోరింది. దానికి వారు అంగీకరించలేదు. దీంతో లలిత బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. మహారాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను సంప్రదించాలని సాల్వేను హైకోర్టు సూచించింది. సాల్వేకు సెక్స్ చేంజ్ సర్జరీ చేయటానికి హోంశాఖ సెలవు మంజూరు చేసింది. దీంతో ఆమె ఉద్యోగ సమస్యకు పరిష్కారం లభించింది. 
 
అనంతరం ముంబైలోని ఒక ఆసుపత్రిలో మూడు విడతల సర్జరీ తరువాత లలితా కుమారి సాల్వేగా ఉండే ఆమె లలిత్ సాల్వేగా మారింది. ముంబైలోని ఒక ఆసుపత్రిలో సెక్స్ ఛేంజ్ చేయించుకుని మహిళ నుంచి పురుషునిగా మారిన పోలీస్ కానిస్టేబుల్ లలిత్ సాల్వే పెళ్లి చేసుకున్నారు. 
 
32 ఏళ్ల లలిత్ అంతకు ముందు లలితగా ఉండేవారు. 2018లో లలిత ముంబైలోని సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో లింగ మార్పిడి ఆపరేషన్  చేయించుకున్నాడు. లలిత్ వివాహం ఔరంగాబాద్‌లోని ఒక దేవాలయంలో అతి కొద్దిమంది బంధుమిత్రులు సమక్షంలో జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అజ్మల్ కసబ్ హిందూ ఉగ్రవాదినా?... పేరు సమీర్ చౌదరి...