మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. 19 యేళ్ల యువతిపై 52 యేళ్ళ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. తన కామవాంఛ తీర్చుకునే ప్రక్రియలో భాగంగా బాధితురాలి ప్రైవేట్ భాగాల్లో ఇనుపరాడ్లు దూర్చాడు. కేకలు వేయకుండా ఉండేందుకు నోట్లో గుడ్డలు కుక్కాడు. అత్యంత పాశవికంగా నడుచుకున్న ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, నాగ్‌పూర్‌లోని పర్ది ఏరియాకు చెందిన యోగిలాల్(52) అనే వ్యక్తి స్థానికంగా ఉన్న స్పిన్నింగ్ మిల్లులో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఈ మిల్లులోనే 19 ఏళ్ల యువతి, ఆమె సోదరుడు, మరో బాలిక కూలీలుగా పని చేస్తున్నారు.
అయితే, ఈనెల 21వ తేదీన యువతి సోదరుడు, మరో బాలిక కలిసి తమ సొంతూరుకు వెళ్లారు. దీంతో 19 యేళ్ళ యువతి ఒక్కటే తాము తీసుకున్న అద్దెగదిలో ఒక్కటి వున్నది. ఇదే అదునుగా భావించిన భావించిన యోగిలాల్.. ఆమెపై అత్యంత దారుణంగా అత్యాచారం చేశాడు.
అంతటితో ఆగకుండా ప్రయివేటు భాగాల్లో ఇనుపరాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె అరవకుండా ఉండేందుకు నోటిలో బట్ట ముక్కలు కుక్కాడు యోగిలాల్. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.