Webdunia - Bharat's app for daily news and videos

Install App

ది గ్రే మాన్ చిత్రానికి సీక్వెల్

Webdunia
బుధవారం, 27 జులై 2022 (17:30 IST)
The Gray Man
ఇటీవల 92 దేశాల్లో విడుదలై అనూహ్య స్పందన లభించిన 'ది గ్రే మాన్' చిత్రానికి సీక్వెల్ నిర్మించడానికి నెట్ ఫ్లిక్స్ సిద్ధమవుతుంది.
 పాపులర్ ఫిల్మ్ వెబ్ సైట్ 'రాటెన్ టమాటోస్' లో 91% ప్రేక్షకుల అభిమానం గెలుచుకున్న ఈ చిత్ర సీక్వెల్ ర్యాన్ గోస్లింగ్, దర్శకులు జో - అంథోని రూసో కాంబినేషన్ లో సిద్ధమవుతుంది. రూసో బ్రదర్స్,  ఎజిబిఓ మైక్ లారొక్క తో పాటు జో రోత్, జెఫ్రె కిర్షెన్ బామ్ నిర్మిస్తున్నారు. 
 
ది గ్రే మాన్ కిచిత్రానికి పని చేసిన కో- రైటర్ స్టీఫెన్ మక్ఫీలీ ఈ చిత్రానికి కూడా రాయనున్నారు.
 
పాపులర్ స్క్రీన్ రైటర్స్ పాల్ వెర్నిక్ మరియు రెట్ రీస్ 'ది గ్రే మాన్' ప్రపంచంలో మరో కొత్త కోణం చూపించనున్నారు. దానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి గొప్యంగానే ఉంచారు.
 
ఈ సందర్భంగా రూసో బ్రదర్స్ మాట్లాడుతూ “ ది గ్రే మాన్ చిత్రానికి ప్రేక్షకుల స్పందన అద్భుతం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల అంచనాలని అందుకున్నందుకు వారి అనూహ్య స్పందనకి చాలా సంతోషంగా ఉంది. ఆసక్తికరమైన పాత్రలున్న ఈ చిత్రాన్ని ఫ్రాంచైస్ లా కొత్త గూఢచారి ప్రపంచంలా చేయాలన్న ఆలోచన మాకెప్పటి నుండో ఉంది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ ని అలాగే మేము త్వరలో ప్రకటించబోయే మరో చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయడానికి సిద్ధమవ్వడం చాలా సంతోషంగా అనిపించింది"
 
నెట్ ఫ్లిక్స్ కి గ్లోబల్ హెడ్ అయిన స్కాట్ స్టూబర్ మాట్లాడుతూ "ది గ్రే మాన్ చిత్రంతో రూసో బ్రదర్స్, ఎబిజిఓ వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్ ఇచ్చారు. అదే నేపథ్యం తో వారితో మరిన్ని చిత్రాలకోసం ఫ్రాంచైస్ ని మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉంది అన్నారు"
ది గ్రే మాన్ సిరీస్ మార్క్ గ్రేనే బెస్ట్ సెల్లింగ్ పుస్తకం ఆధారంగా తీయబడింది.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments