ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రానా ఏంచేశాడో తెలుసా!
						
		
			      
	  
	
			
			  
	  
      
								
			
				    		 , సోమవారం,  31 జనవరి 2022 (16:45 IST)
	    	       
      
      
		
										
								
																	ఈరోజు ముంబై ఎయిర్ పోర్ట్‌లో వెంకటేష్, రానా  దగ్గబాటి ఇద్దరూ దిగారు. అక్కడనుంచి ఓ షూట్‌లో పాల్గొనేందుకు వెళుతున్నారు. అయితే వెంకటేష్ తన ట్రైనీతో లగేజీని తీసుకుంటూ వెళుతుండగా, రానా మాత్రం తన భార్య మిహీకా బజాజ్ చేతి బ్యాగ్‌ను పట్టుకుని వస్తున్నాడు. ఎయిర్ పోర్ట్‌లో కారు దిగినప్పటినుంచీ ఆమె హ్యాండ్ బాగ్‌ను పట్టుకోవడం ఆమె ముందుకు నడవడం జరిగింది. ఇది అభిమానులకు ఆశ్చర్యం కలిగించినా పెండ్లయినా తర్వాత భార్యకు ఈమాత్రం గౌరవం ఇవ్వకపోతే ఎలా అనేలా అభిమానులు సోషల్ మీడియాలో సరదాగా కామెంట్ చేస్తున్నారు.
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
									
										
								
			
							 
										
								
																	ఇదిలా వుండగా, రానా, వెంకటేష్ ఇద్దరు కలిసి  `రానా నాయుడు` పేరుతో నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ కోసం మొదటిసారిగా కలిసి పని చేస్తున్నారు. ఈ సిరీస్ అమెరికన్ క్రైమ్ డ్రామా రే డోనోవన్ కు రీమేక్. ఇందులో వెంకీ తండ్రిగా నటిస్తున్నాడు. ఇందులో ఆయన గెటప్ సరికొత్తగా వుంది. తెల్లటి గెడ్డం, జుట్టుతో ఇటీవలే విడుదలైన పిక్‌కు మంచి స్పందన వచ్చింది.  లోకోమోటివ్ గ్లోబల్ మీడియా ఎల్‌ఎల్‌పికి చెందిన సుందర్ ఆరోన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
 
									
											
							                     
							
							
			        							
								
																	
		
		 
		
				
		
						 
		 
		  
        
		 
	    
  
	
 
	
				       
      	  
	  		
		
			
			  తర్వాతి కథనం