Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎఫ్ 3 షూటింగ్ పూర్తి - ఏప్రిల్ 28న విడుదల

Advertiesment
ఎఫ్ 3 షూటింగ్ పూర్తి - ఏప్రిల్ 28న విడుదల
, శనివారం, 29 జనవరి 2022 (18:07 IST)
Venkatesh, Varun Tej, Anil Ravipudi
వెంకటేష్,  వరుణ్ తేజ్ కలిసి ఎఫ్ 3 సినిమాతో వేసవికి మూడు రెట్లు వినోదాన్ని అందించబోతోన్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 28న విడుదల కానుంది.
 
సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తయింది. ఒక్క సాంగ్ షూట్  మాత్రమే బ్యాలెన్స్ ఉంది. డబుల్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్గా రాబోతోన్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
 
ట్రేడ్ వర్గాల్లో ఉన్న క్రేజ్, సినిమా మీద వచ్చిన పాజిటివ్ వైబ్స్ దృష్ట్యా సినిమాకు సంబంధించిన అప్డేట్లతో మేకర్లు అందరినీ ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నారు.
 
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ వంటి వారితో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్ను అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. మూడో హీరోయిన్గా ఎఫ్ 3లో సోనాల్ చౌహాన్ కనిపించబోతోన్నారు. వినోదం, గ్లామర్ ఇలా అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎఫ్ 3 కోసం సూపర్ హిట్ ఆల్బమ్ను రెడీ చేశారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్గా,  తమ్మిరాజు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు.
 
నటీనటులు: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ ,రాజేంద్ర ప్రసాద్, సునీల్ తదితరులు
 
సాంకేతిక బృందం
 
డైరెక్టర్: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: శిరీష్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి
సంగీత : దేవీ శ్రీ ప్రసాద్
కెమెరామెన్: సాయి శ్రీరామ్
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటింగ్: తమ్మిరాజు
స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: ఎస్ కృష్ణ
అడిషనల్ స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస్ మహారాజతో పవన్ మాజీ భార్య.. ఏ సినిమాలో తెలుసా?