ఇది చూశారా. తనకు బాగా సూటయిన నెక్లెస్‌ను ఇలా మెడలో వేసుకున్న తర్వాత ఒకసారి ఫోజ్ ఇచ్చి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటుంది సీనియర్ నటి. సీనియర్ నటీమణులు సినిమాల్లో నటించాక ఇక చాలు అన్నంతంగా కొందరు వుంటే, ఇంకా సినిమారంగంలో హీరోయిన్‌గా కొనసాగాలని చూస్తున్నారు. అలా చూసినా పెద్దగా అవకాశాలు రావడంలేదు. అందుకే జీవితంలో ఓ ఇంటిదానిని అయితే బాగుంటుందని పలువురు హీరోయిన్లు చూస్తుంటారు. తాజాగా అనుష్క కూడా ఆ బాటలోవుందని సమాచారం. ఇప్పుడు తాజాగా ఎప్పటినుంచో ఆమెకు పెళ్లి అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ టైం వచ్చిందని కోలీవుడ్ పరిశ్రమ చెబుతోంది. చాలాకాలం క్రితం ఆమె బాత్ స్నానం చేస్తుండగా ఫొటోలు కొన్ని బయటకు వచ్చాయి. అవి వైరల్ అయ్యాయి. అర్థమయివుంటుంది గదూ.. ఆమె త్రిష.
Trisha neckles
సీనియర్ హీరోయిన్ త్రిష తాజాగా త్రిష పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తోంది. అందుకు ఈ నెక్లెస్ సాక్షి అంటూ కోలీవుడ్ వర్గాలు నమ్ముతున్నాయి. ఆమె ఈ నెక్లస్ ఫొటోను కొద్దిరోజుల క్రితమే పోస్ట్ చేసింది. అందుకే అక్కడి మీడియా వర్గాల కథనాల ప్రకారం ఈ వార్తకు మరింత బలం చేకూర్చేలా ఉందట త్రిష వ్యవహారం. ఆమె ఒక బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్ధం అయిందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే.
అయితే గతంలోనే వరుణ్ మణియన్ అనే బిజినెస్‌మేన్‌తో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు గానీ, ఆ పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు కరోనా టైంలో చాలా సమయం వుంది కనుక పరిమిత సభ్యులతో వివాహం చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె రెండు సినిమాల్లో నటిస్తోంది. కరోనావల్ల గేప్ వచ్చింది. సో.. త్రిష ఏమంటుందో త్వరలో తెలియనుంది.