Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"ఉక్కు సత్యాగ్రహం" పాట ఆవిష్కరించిన గద్దర్

, శనివారం, 1 మే 2021 (16:13 IST)
Gaddar- Satyareddy
విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్య కథతో తెరకెక్కుతున్న చిత్రం "ఉక్కు సత్యాగ్రహం". ఈ చిత్రం కోసం యుద్ధ నౌక గద్దర్ రచించి, పాడిన "సమ్మె నీ జన్మహక్కురన్నో..." అంటూ సాగే లిరికల్ వీడియో పాటను మే డే సందర్భంగా గద్దర్ తన చేతులమీదుగానే విడుదల చేయడం ఓ విశేషం. ఈ పాటను ప్రధాన పాత్రధారి సత్యారెడ్డి, ఇతర ఆర్టిస్టులులతో పాటు గద్దర్ పైన చిత్రీకరించారు.
 
తాను ఏ తరహా సినిమా తీసినా అందులో సామాజిక అంశాలను మి ళితం చేసే సత్యారెడ్డి ఇప్పటివరకు ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి ,రంగుల కళ ,కుర్రకారు ,అయ్యప్ప దీక్ష , గ్లామర్, సిద్ధం, ప్రశ్నిస్తా వంటి 42 చిత్రాలు నిర్మించారు. దర్శక, నిర్మాతగానే కాకుండా నటుడిగా కూడా తన అభిరుచిని చాటుకుంటున్న సత్యారెడ్డి 
జనం సమస్యల పరిష్కారం కోసం రగులుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాన అంశంగా చేసుకుని తాజాగా "ఉక్కు సత్యాగ్రహం" పేరుతో  ఓ సినిమా తీస్తున్నారు. తాను ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సత్యారెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 
మొదటి షెడ్యూల్ ఇటీవల వైజాగ్ పరిసరాల్లో జరిగింది. ఇందులో భాగంగా ఈ పాటను చిత్రీకరించామని దర్శక నిర్మాత, నటుడు సత్యారెడ్డి తెలిపారు. రెండో షెడ్యూల్ ను కోవిడ్ ఉధృతి తగ్గిన తర్వాత మొదలు పెడతామని ఆయన చెప్పారు. ఇందులో పదమూడు నిమిషాల పాట మరో హైలైట్ గా ఉంటుందని, దానిని కూడా గద్దర్ పాడటంతో పాటు ఆ పాటలో కూడా ఆయన నటించారని, అలాగే ఓ పాత్రలో కూడా ఆయన కనిపిస్తారని సత్యారెడ్డి తెలిపారు. 
ఇంకా సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న, చంద్రబోస్ పాటలు రాశారని ఆయన వివరించారు. ప్రముఖ నటీనటుఈలతో పాటు ఇంకా ఈ చిత్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు, రాజకీయ ప్రముఖులు, ప్రజాసంఘాల నాయకులు నటిస్తారని ఆయన తెలిపారు.
 
గద్దర్ మాట్లాడుతూ, ఓ మంచి ఉద్యమ చిత్రాన్ని ఉద్యమ కాలంలోనే తీస్తున్న సత్యారెడ్డిని అభినందించారు.
 
ఈ చిత్రానికి సంగీతం- శ్రీకోటి ,
కెమెరా- వెంకట్, 
నిర్మాణ సారధ్యం- పి సతీష్ రెడ్డి
సహ నిర్మాతలు- సంఘం శంకర్ రెడ్డి, కుర్రి నారాయణరెడ్డి, శేషుబాబు యాదవ్.
రచనా సహకారం -శ్రీ వేముల
 నిర్వహణ: పోలిశెట్టి వెంకట నాగు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న‌మ్ర‌త చేసిన మేలు వ‌ల్ల లాభ ప‌డింది ఎవ‌రు?