Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

`రాజా హే రాజా` అంటూ పాడుకుంటున్న `బాయ్స్‌` (video)

Advertiesment
`రాజా హే రాజా` అంటూ పాడుకుంటున్న `బాయ్స్‌` (video)
, శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (16:53 IST)
Boys poster
శ్రీ పిక్చర్స్ బ్యానర్ పై గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రల్లో దయానంద్ తెరకెక్కిస్తున్న సినిమా బాయ్స్. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఒక యూత్ ఫుల్ కాలేజ్ సాంగ్ విడుదల చేశారు. రాజా హే రాజా అంటూ సాగే ఈ పాటను శ్రీమణి రచించారు. స్మరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడారు. లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ బాయ్స్ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మిత్ర శర్మ. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. బెక్కం రవీందర్, కొండపతురి ప్రసాద్ ప్రొడక్షన్ మేనేజర్లుగా పని చేస్తున్నారు. 
 
నటీనటులు: 
గీతానంద్, మిత్ర శర్మ, రోనిత్, అన్షుల ధావన్, శ్రీహాన్, జెన్నిఫర్ ఎమ్మాన్యూయేల్, శీతల్ తివారి, సుజిత్, బంచిక్ బబ్లు, కౌశల్ మంద, రమ్య..
 
టెక్నికల్ టీమ్: 
రచన, దర్శకత్వం: దయానంద్
బ్యానర్: శ్రీ పిక్చర్స్
నిర్మాత: మిత్రా శర్మ
సహ నిర్మాత: పడవల బాలచంద్ర
సంగీత దర్శకుడు: స్మరన్
గాయకుడు: రాహుల్ సిప్లిగంజ్
లిరిక్స్: శ్రీమణి
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
కొరియోగ్రఫీ: జావేద్
పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్
లిరికల్ వీడియో: సాయివిహార్ పంతంగి
ప్రొడక్షన్ డిజైన్: దిలీప్ జాన్, రవి మొండ్రు


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమా క‌ష్టాలు తెలిపే `సినిమా బండి`