Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త‌లా అని పిలుచుకునే అజిత్‌కు యాభైఏళ్ళు

Advertiesment
త‌లా అని పిలుచుకునే అజిత్‌కు యాభైఏళ్ళు
, శనివారం, 1 మే 2021 (16:54 IST)
Ajit 1st movie, by pulagam
అజిత్ పుట్టి పెరిగింది హైద‌రాబాద్‌లోనే. అత‌న్ని త‌మిళంలో బాగా ఆరాధించారు. ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. దానికి కార‌ణం తెలుగులో ఆయ‌న పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయాడు. అజిత్ తొలి సినిమా ‘ప్రేమ పుస్తకం’ వర్కింగ్ స్టిల్ ఇది. స‌న్న‌గా పొడుగ్గా ఎలా వున్నాడో చూడండి. అప్పుడు అజిత్ పేరు శ్రీకర్. ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీ\రావుగారి అబ్బాయి గొల్లపూడి శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందింది. కానీ, షూటింగ్ తొమ్మిదో రోజున కొడుకు చనిపోతే, తండ్రి పూర్తి చేశారు. 
 
మే 1 అజిత్ పుట్టిన రోజు. తమిళులు 'తలా' అని ప్రేమగా పిలుచుకుంటారు. ఇప్ప‌టివ‌ర‌కు అజిత్ 59 సినిమాలు పూర్తి చేశాడు. ఒక‌ద‌శ‌లో త‌మిళంలో విజ‌య్‌, అజిత్‌లు పోటాపోటీగా నటించేవారు. రజనీకాంత్ తరహాలో అజిత్ ఎలా ఉంటే అదే స్టైల్ అనే స్థాయికి చేరిపోయాడు. సాల్ట్ అండ్ పెపర్ స్లైల్ అజిత్ కు సింబాలిక్ గా మారిపోయింది. 2000 సంవత్సరంలో నటి షాలినిని అజిత్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. అజిత్ లేటెస్ట్ మూవీ 'వాలిమై' తో టాలీవుడ్ క్రేజీ హీరో కార్తికేయ విలన్ గా కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"ఉక్కు సత్యాగ్రహం" పాట ఆవిష్కరించిన గద్దర్