Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను స్టూడెంట్ సార్ లో అర్జున్ వాసుదేవన్‌గా సముద్రఖని

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (16:04 IST)
Samudrakhani,
హీరో బెల్లంకొండ గణేష్ యాక్షన్ థ్రిల్లర్ ''నేను స్టూడెంట్ సార్!'. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ చిత్రాన్ని 'నాంది’ సతీష్ వర్మ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రొడక్షన్ బ్యానర్ నుండి వచ్చిన మొదటి సినిమా ‘నాంది ’ లానే 'నేను స్టూడెంట్ సార్!' కూడా యూనిక్ సబ్జెక్ట్ తో కూడిన కంటెంట్ రిచ్ మూవీ. దర్శకుడు కృష్ణ చైతన్య కథను అందించారు.
 
చిత్ర నిర్మాతలు పోస్టర్ల ద్వారా చిత్రంలోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తున్నారు. ముందుగా కథానాయకుడు గణేష్, కథానాయిక అవంతిక దాసాని ఫస్ట్ లుక్స్ ని ఆవిష్కరించారు. ఈ చిత్రంలో అర్జున్ వాసుదేవన్‌గా నటిస్తున్న సముద్రఖని ఫస్ట్‌లుక్‌ను  ఈ రోజు విడుదల చేశారు. పాత్ర పేరు సూచించినట్లుగా, సముద్రఖని హీరోయిన్ అవంతిక తండ్రి గా కనిపించనున్నారు. అవంతిక పాత్ర పేరు శృతి వాసుదేవన్ గా ఇదివరకే పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సముద్రఖని సీరియస్ గా నడిచివస్తున్న  పోలీసు అధికారిగా కనిపించారు. సముద్రఖని వెనుక పెద్ద సంఖ్యలో విద్యార్ధుల సమూహం కూడా గమనించవచ్చు.
 
ఈ సినిమాలో సునీల్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిత్ మధాడి డీవోపీగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు.
 
సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు.
 
నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి సాయితేజ తదితరులు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments