ఇటీవల విడుదలైన 'స్వాతిముత్యం'తో ఆకట్టుకున్న హీరో బెల్లంకొండ గణేష్ తన రెండో సినిమాగా ''నేను స్టూడెంట్ సార్!' అనే యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న చిత్రమిది. తొలి చిత్రం 'నాంది' విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ గా విజయవంతమైంది. 'నాంది సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య కథను అందించారు.
ఇటివలే ఈ చిత్రానికి సంబధించిన విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో గణేష్ టెర్రిఫిక్ గా కనిపించారు. ఈ రోజు.. అవంతిక దస్సానిని ఈ చిత్రంలో హీరోయిన్ గా పరిచయం చేశారు. ఇందులో ఆమె పాత్ర పేరు శృతి వాసుదేవన్. అలనాటి నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని 'నేను స్టూడెంట్ సర్' సినిమాతో అరంగేట్రం చేస్తోంది. ఫస్ట్ లుక్ లో స్టైలిష్ అండ్ క్యూట్‌గా కాలేజీ స్టూడెంట్‌గా కనిపిస్తోంది.
సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిత్ మధాడి డీవోపీగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు.
సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి సాయితేజ తదితరులు.