Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌మంత‌ నటించిన శాకుంతలం ఏప్రిల్ 14న రిలీజ్

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (17:43 IST)
Sakunthalam new poster
శకుంత‌లగా బ్యూటీఫుల్ హీరోయిన్ స‌మంత,.దుష్యంత మ‌హారాజుగా దేవ్ మోహ‌న్ న‌టిస్తోన్న‌ పౌరాణిక ప్రేమ క‌థా చిత్రం ‘శాకుంతలం’. ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ ఎపిక్ ల‌వ్ స్టోరి ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. సినిమా అనేది లార్జ‌ర్ దేన్ లైఫ్‌గా ఉండాలంటూ ప్ర‌తి ఫ్రేమ్‌ను అద్భుతంగా తెర‌కెక్కించే డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంత‌లంను రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.
 
విజువ‌ల్ వండ‌ర్‌గా త్రీడీ టెక్నాల‌జీతో తెలుగు, హిందీ, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ పెద్ద ఎత్తున జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్, ‘మల్లికా మల్లికా..’ సాంగ్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్‌ను క్రియేట్ చేశాయి.
 
 శాకుంత‌లం చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందించారు. శేఖ‌ర్ వి.జోసెఫ్ సినిమాటోగ్ర‌ఫీ చేసిన ఈ చిత్రానికి ప్ర‌వీణ్ పూడి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. మ‌ణి శ‌ర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని విజువ‌ల్‌గానే కాకుండా మ్యూజికల్‌గానూ ఆడియెన్స్‌కు ఆమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌టానికి రీ రికార్డింగ్‌ను బుడాపెస్ట్‌, హంగేరిలోని సింఫ‌నీ టెక్నీషియ‌న్స్ వ‌ర్క్ చేశారు. 
 
స‌మంత, దేవ్ మోహ‌న్ జంట‌గా  న‌టించిన శాకుంత‌లం చిత్రంలో  డా.ఎం.మోహ‌న్ బాబు, ప్ర‌కాష్‌ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువ‌రాజు భ‌ర‌తుడి పాత్ర‌లో న‌టించ‌టం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments