Vijay Devarakonda, Parasuram, Dil Raju
"గీత గోవిందం" తో బ్లాక్ బస్టర్ సాధించిన హీరో విజయ్ దేవరకొండ, పరశురామ్ లు మరో సినిమా చేయబోతున్నారు. ఈ కొత్త చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ లు ఎస్.వి.సి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. సరికొత్త కథతో తెరకెక్కనున్న ఈ చిత్రంతో విజయ్ మొదటి సారి దిల్ రాజు, శిరీష్ ల ఎస్.వి.సి క్రియేషన్స్ బ్యానర్లో పని చేయనుండడంతో చిత్రం పై అంచనాలు నెలకొన్నాయి.
భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన విషయాలని అధికారికంగా ప్రకటించారు. గీత గోవిందం కంటే మించిన కథతో పాటు యాక్షన్ అంశాలు ఇందు ఉంటాయని తెలుస్తోంది. ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల మరియు ఇతర వివరాలని త్వరలోనే వెల్లడించనున్నారు.