ప్రముఖ చలనచిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్‌కు గౌరవసూచకంగా.ప్రొఫెసర్ వశిష్ట్ మరియు అతని విద్యార్థులు కాలికట్‌లోని మలబార్ క్రిస్టియన్ కళాశాల వద్ద ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ ఫోటోలను పెట్టి నివాళి అర్పించారు. ఇటీవలే కళాశాలలో ప్రత్యేక సంస్మరణ సభ నిర్వహించారు. గతంలో మలబార్ క్రిస్టియన్ కళాశాల తెలుగు చలనచిత్ర క్లబ్ శంకరాభరణం, సాగర సంగమం, వంటి ప్రముఖ చిత్రాలను ప్రదర్శించింది. స్వాతి ముత్యం మరియు స్వాతి కిరణం చిత్రాల టైములో కె.విశ్వనాథ్ ను కలిసిన విషయాలను గుర్తుచేసుకున్నారు. కేరళలో కె.విశ్వనాథ్‌కు ప్రతేకమైన గుర్తింపు ఉందని ప్రొఫెసర్ వశిష్ట్ అన్నారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో ఫిలిం ఛాంబర్ లో దర్శకుల సంఘం కె.విశ్వనాథ్‌కు నివాళి అర్పించింది. దర్శకుల సంఘం అధక్షుడు కాశి విశ్వనాథ్, వినాయక్, సముద్ర, ప్రసన్న కుమార్, మోహన్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ, సినిమాలకు ప్రతేకమైన గౌరవం తెచ్చిన దర్శకుడు కె.విశ్వనాథ్ అని కొనియాడారు. ప్రభుత్య పరంగా ఆయన ఆపేరుమీద ఏదైనా చేయాలనీ కోరారు.