నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించే అన్‌స్టాపబుల్ సీజన్-2 సక్సెస్ ఫుల్‌గా రనౌతోంది. గతవారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి ఎపిసోడ్ రాగా ఈ వారం రెండో ఎపిసోడ్ విడుదలైంది. ఈ షోలో పవన్ పలు విషయాలు వెల్లడించారు. సినీ జీవితంతో పాటు వ్యక్తి గత జీవితంలో పవన్ కల్యాణ్ ఎదుర్కొన్నఒడిదుడుకులను తెలియజేశారు.
చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్లు గురించి చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచి ఆస్తమా జ్వరం వుండేవని.. ఆరు ఏడో తరగతుల్లో సరిగా వుండేది కాదని.. సరైన స్నేహితుల్లేక ఇంటిపట్టునే వుండాల్సి వచ్చేదని పవన్ చెప్పారు.
పుస్తకాలే తనకు స్నేహితులని తెలిపారు. కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డానని.. స్నేహితులంతా ఉన్నత చదువులు, క్రికెట్‌లో రాణిస్తున్న వేళ తాను పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయానని పవన్ వెల్లడించారు. 17 ఏళ్ల వయస్సులోనే మానసికంగా కుంగిపోయానని.. చనిపోతే బాగుండు అనిపించిందని పవన్ వెల్లడించారు.
అన్నయ్య లైసెన్స్ రివాల్వర్ తీసుకుని కాల్చుకుందామని అనుకున్నానని.. సురేఖ వదిన, నాగబాబు అన్నయ్య గమనించి ఎందుకలా వున్నావని అడిగారు. కాల్చుకుందామనుకుంటున్నానని చెప్పడంతో చిరంజీవి అన్నయ్య దగ్గరకు తీసుకెళ్లి.. అసలు విషయం చెచెప్పారు. అప్పుడే చిరు అన్నయ్య చదవకపోయినా పర్లేదని.. బతికుంటే చాలునన్నారని పవన్ చెప్పుకొచ్చారు.
ఇంకా బాలయ్యను పవన్ కొనియాడారు. ఆయనకు ముక్కుసూటి స్వభావం అన్నారు. బాలయ్య ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటున్నానని పవన్ ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి చాలా నేర్చుకున్నానని, సద్విమర్శల వల్ల మనలోని లోపాలేంటో తెలుసుకుని, సరిచేసుకునే అవకాశం వుంటుందని చెప్పారు. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవని.. చెప్పుకొచ్చారు.