Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు‌కు నో చెప్పిన సాయిపల్లవి.. ఎందుకో తెలుసా? (video)

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (14:11 IST)
సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించే అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా.. అయితే ఫిదా భామ సాయిపల్లవి మాత్రం ఆ అవకాశాన్ని వదులుకుందట. అనిల్ రావిపూడి దర్వకత్వంలో మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 
 
ఈ మూవీలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అంతేకాదు ఉగాది సందర్భంగా బుల్లితెరపై ఈ మూవీ ప్రీమియర్‌ షో ప్రదర్శించగా.. అక్కడా అత్యధిక టీఆర్పీని సాధించి.. బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది.
 
కాగా ఈ మూవీలో మొదట హీరోయిన్‌గా సాయి పల్లవిని అనుకున్నారట. ఈ మేరకు ఆమెను సంప్రదించినట్లు కూడా సమాచారం. కానీ ఈ సినిమాలో నటించేందుకు ఆమె నో చెప్పిందట. ఇక ఆ తరువాత ఆ ఆఫర్ రష్మికకు వెళ్లినట్లు సమాచారం. సరిలేరు నీకెవ్వరులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని భావించిన సాయి పల్లవి.. ఆ ఆఫర్‌కు నో చెప్పినట్లు తెలుస్తోంది. 
 
కాగా ప్రస్తుతం సాయి పల్లవి, రానా విరాట పర్వం.. నాగ చైతన్య సరసన లవ్ స్టోరీలో నటిస్తోంది. వీటి తరువాత కిశోర్ తిరుమల తెరకెక్కించబోయే కామెడీ ఎంటర్‌టైనర్‌లో శర్వానంద్‌తో మరోసారి జోడీ కట్టబోతోంది సాయి పల్లవి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

భార్య వేధిస్తోంది.. పోలీసులు పట్టించుకోవడం లేదు : టెక్కీ ఆత్మహత్య

పంది కిడ్నీతో 130 రోజుల పాటు బతికిన మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments