లవ్ స్టోరీ.. సాయిపల్లవికి పోటీ ఇవ్వనున్న చైతన్య

శుక్రవారం, 20 మార్చి 2020 (10:50 IST)
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల రెండేళ్ళు గ్యాప్ తీసుకుని డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, నాగచైతన్య జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా పవన్ హెచ్ అందించిన పాటల్లో రిలీజైన హే పిల్లా పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
అయితే ఈ సినిమాలో నాగచైతన్య కెరీర్ బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడిగా కనిపించబోతున్న చైతన్య ఈ సినిమా కోసం తెలంగాణ మాండలికాన్ని నేర్చుకున్నాడట. 
 
సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె నటన పీక్స్‌లో ఉంటుందని సమాచారం. ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ హీరో అయినప్పటికీ సాయిపల్లవికే ఎక్కువ పేరు వచ్చింది. మరి ఈ సినిమాలో సాయిపల్లవిని అందుకోవాలంటే నాగచైతన్య పర్ ఫార్మెన్స్ ఏ రేంజ్‌లో వుంటుందో తెలియాల్సి వుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వరలక్ష్మికి మళ్లీ విలన్ గెటప్.. మాస్ మహారాజాతో పోటీ పడుతుందా?