మాస్ మహారాజాకు చుక్కలు చూపించనున్న వరలక్ష్మీ శరత్ కుమార్ (Video)

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (12:31 IST)
తెలుగులో 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన విలన్ రోల్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. ప్రస్తుతం ఆమె రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న 'క్రాక్' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో తనే మెయిన్ విలన్ అనేది తాజా సమాచారం. 
 
తన భర్తను అంతం చేసిన హీరోపై పగ తీర్చుకునే విలన్ పాత్రలో ఆమె కనిపించనుందని అంటున్నారు. అందుకు సంబంధించిన సన్నివేశాల్లో ఆమె నటన, ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఈ రోల్ వరలక్ష్మీ శరత్ కుమార్‌కి తప్పకుండా ఈ సినిమా తెలుగులో బ్రేక్ ఇస్తుందని టాక్ వస్తోంది.
 
నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న క్రాక్ సినిమా ర‌వితేజ 66వ చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక రవితేజ నటించిన డిస్కో రాజా ఇటీవల విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో క్రాక్ సినిమా పైనే రవితేజ తన ఆశలన్నీ పెట్టుకున్నాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments