Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.1000 కోట్లను క్రాస్ చేసిన "ఆర్ఆర్ఆర్" - 16 రోజుల్లో అరుదైన రికార్డు

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (11:16 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". ఎన్టీఆర్, రాంచరణ్‌లు హీరోలుగా నటించారు. గత నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే రూ.500 కోట్లపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే, ఇపుడు బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్ధలు కొడుతుంది. 
 
ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇంతకుముందు రూ.1000 కోట్లు వసూలు చేసిన చిత్రాలు భారతీయ సినీ చరిత్రలో రెండో ఉన్నాయి. అవి "దంగల్" మొదటి చిత్రం కాగా రెండోది "బాహుబలి". ఇపుడు "ఆర్ఆర్ఆర్" చేరింది. ఇందులో రాజమౌళి తెరకెక్కించిన రెండు చిత్రాలు ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ వెల్లడించారు. 
 
రూ.1000 కోట్లు దాటి వసూలు చేసిన చిత్రాల్లో రెండు రాజమౌళి చిత్రాలు ఉండటం, తన సినిమాకు కమర్షిల్ సక్సెస్ తీసుకుని రాగల ఆయన నైపుణ్యానికి నిదర్శనమని చెప్పుకోవాలి. 
 
కాగా, "ఆర్ఆర్ఆర్" చిత్రానికి రామజౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చారు. ఈ చిత్రంలో కొమరంభీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలను జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌లు పోషించారు. నిర్మాత డీవీవీ దానయ్య రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించారు. మార్చి 25వ తేదీన థియేటర్లలో విడుదలకాగా, గత 16 రోజుల్లోనే ఈ చిత్రం రూ.1000 కోట్లను వసూలు చేయడం చెప్పుకోదగిన విషయం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం వెనుక 5 కీలక కారణాలు, ఏంటవి?

కంట్లో నలక పడిందని వెళితే కాటికి పంపిన ఆసుపత్రి

జార్ఖండ్‌లో 24 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. మళ్లీ సీఎంగా హేమంత్ సోరేన్

నేషనల్ మీడియాలో పవన్ ప్రస్తావన: 70 శాతం పట్టున్న కాంగ్రెస్ స్థానాలను NDA ఖాతాలో వేసాడంటూ...

మహారాష్ట్ర సీఎం ఎవరు? మోదీ, అమిత్ షాల ఓటు ఎవరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments