Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ స్టార్ క్రికెటర్ బయోపిక్‌ హీరోగా చెర్రీ!?

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (13:31 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్ ఓ స్టార్ క్రికెటర్ బయోపిక్‌లో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ క్రికెటర్ ఎవరో కాదు.. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం చెర్రీ.. 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకున్నారు. ఫలితంగా ఆయనకు హాలీవుడ్ మూవీల్లో నటించే అవకాశాలు రానున్నాయనే ప్రచారం జోరుగా సాగుతున్నాయి. ఈ విషయంలో పలు హాలీవుడ్ నిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇక టాలీవుడ్, బావీవుడ్ సంగతి చెప్పనక్కర్లేదు. 
 
గతంలో ఆయన నటించిన తుపాన్ చిత్రంతో హిందీ సీమలో అడుగుపెట్టారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఆ తరవాత మళ్లీ అలాంటి సాహసం చేయలేదు. కానీ ఎప్పటికైనా బాలీవుడ్‌లో ఓ సూపర్ హిట్టు కొట్టి రీ ఎంట్రీ ఇవ్వాలన్న తాపత్రయ పడుతున్నారు. అందుకు ఇదే సరైన అవకాశం. 'బాలీవుడ్‌లో అవకాశం వస్తే.. బయోపిక్‌లో నటించాలని ఉందని, కోహ్లీ కథలో కనిపించే అవకాశం వస్తే వదులుకోనని ఇటీవల ఓ చిట్ చాట్లో చెప్పుకొచ్చాడు.
 
నిజానికి కోహ్లీ బయోపిక్ వస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తనపై సినిమా చేయడానికి కోహ్లీ కూడా అంగీకారం తెలిపాడు. అయితే సరైన హీరో దొరక్క.. ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. చరణ్ మనసులో మాట వినగానే.. బాలీవుడ్‌లో కొత్త ఆశలు చిగురించాయి. ఇప్పుడు చరణ్ని దృష్టిలో ఉంచుకొని కోహ్లీ బయోపిక్‌ను డిజైన్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు అభిమానులు సైతం కోహ్లీగా చరణ్ బాగుంటాడని, ఇద్దరిలోనూ కొన్ని పోలికలు ఉన్నాయిని అప్పుడే పాజిటివ్‌గా స్పందించడం మొదలెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments