Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విరాట్ కోహ్లీ బయోపిక్‌పై కన్నేసిన మెగా పవర్ స్టార్

Advertiesment
ram charan
, ఆదివారం, 19 మార్చి 2023 (08:58 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మెగా పవర్ స్టార్‌గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఇపుడు ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకున్నారు. ఫలితంగా ఆయనకు హాలీవుడ్ మూవీల్లో నటించే అవకాశాలు రానున్నాయనే ప్రచారం జోరుగా సాగుతున్నాయి. ఈ విషయంలో పలు హాలీవుడ్ నిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇక టాలీవుడ్, బావీవుడ్ సంగతి చెప్పనక్కర్లేదు. 
 
గతంలో ఆయన నటించిన తుపాన్ చిత్రంతో హిందీ సీమలో అడుగుపెట్టారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఆ తరవాత మళ్లీ అలాంటి సాహసం చేయలేదు. కానీ ఎప్పటికైనా బాలీవుడ్‌లో ఓ సూపర్ హిట్టు కొట్టి రీ ఎంట్రీ ఇవ్వాలన్న తాపత్రయ పడుతున్నారు. అందుకు ఇదే సరైన అవకాశం. 'బాలీవుడ్‌లో అవకాశం వస్తే.. బయోపిక్‌లో నటించాలని ఉందని, కోహ్లీ కథలో కనిపించే అవకాశం వస్తే వదులుకోనని ఇటీవల ఓ చిట్ చాట్లో చెప్పుకొచ్చాడు.
 
నిజానికి కోహ్లీ బయోపిక్ వస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తనపై సినిమా చేయడానికి కోహ్లీ కూడా అంగీకారం తెలిపాడు. అయితే సరైన హీరో దొరక్క.. ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. చరణ్ మనసులో మాట వినగానే.. బాలీవుడ్‌లో కొత్త ఆశలు చిగురించాయి. ఇప్పుడు చరణ్ని దృష్టిలో ఉంచుకొని కోహ్లీ బయోపిక్‌ను డిజైన్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు అభిమానులు సైతం కోహ్లీగా చరణ్ బాగుంటాడని, ఇద్దరిలోనూ కొన్ని పోలికలు ఉన్నాయిని అప్పుడే పాజిటివ్‌గా స్పందించడం మొదలెట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24న దేశ వ్యాప్తంగా 'జాన్ విక్ చాప్టర్ 4' రిలీజ్