Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్తికేయ 2తో నిఖిల్ సిద్ధార్థ కి జాతీయ స్థాయిలో పాపులర్ ఛాయిస్ అవార్డ్

Advertiesment
Popular Choice Award for Nikhil
, సోమవారం, 20 మార్చి 2023 (10:51 IST)
Popular Choice Award for Nikhil
యంగ్ నిఖిల్ సిద్ధార్థ కార్తికేయ 2 తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గా కూడా మంచి విజయాన్ని అందుకుంది. కార్తికేయ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 121 కోట్లకు పైగా వసూలు చేసింది మరియు పాన్ ఇండియా స్టార్‌గా నిఖిల్ ను నిలబెట్టింది. ఈ చిత్రం ఉత్తరాది, దక్షిణాది లో  అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. 
 
కార్తికేయ-2  చిత్రం టీవీ ప్రీమియర్ మరియు OTT స్ట్రీమింగ్ లో కూడా  ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రశంసలు, వసూళ్లు మాత్రమే కాకుండా అవార్డుల విభాగంలోనూ నిఖిల్ తన సత్తాను నిరూపించుకున్నాడు. తాజాగా కార్తికేయ చిత్రంతో, ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 2023లో నిఖిల్ సిద్ధార్థ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. 
 
కార్తికేయ - 2 చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు నిర్మించాయి. టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంతో చందు మొండేటి కృష్ణ తత్వాన్ని, మహిమను చెప్పడంతో పాటు, పురాణ ఇతిహాసాల్లో చెప్పిన ప్రతి అంశం శాస్త్రీయమైనదే నని బలంగా చెప్పాడు.  మనం ఎలా బతకాలో శ్రీకృష్ణుడు చెప్పిన విధానాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. 
 
హీరో నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2 విజయ పరంపరను కొనసాగిస్తూ, నిఖిల్ ఇటీవల తెలుగులో 18 పేజీల రొమాంటిక్ డ్రామాతో విజయం సాధించాడు. నిఖిల్ సిద్ధార్థ ప్రస్తుతం తన తదుపరి పాన్ ఇండియా చిత్రం  SPYతో సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో సహా 5 భాషల్లో రూపొందుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోస్టి తో ప్రేక్షకులకు కామెడీ థ్రిల్లింత ఇవ్వనున్న కాజల్ అగర్వాల్