Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అడివి శేష్ పాన్ ఇండియా మూవీ G2 జనవరిన ఆల్ ఇండియా లాంచ్

Advertiesment
G2 poster
, గురువారం, 29 డిశెంబరు 2022 (14:34 IST)
G2 poster
వైవిధ్యమైన, విలక్షణమైన, ఒకదానికొకటి ప్రత్యేకమైన తన చిత్రాల తో భారీ ఫాలోయింగ్ క్రియేట్ చేశారు అడివి శేష్. కథల ఎంపికతో ప్రేక్షకుల్లో ఒక కల్ట్ ఫాలోయింగ్ సంపాదించారు. అడివి శేష్ 'గూఢచారి' తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక పాత్ బ్రేకింగ్ మూవీ. ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. వీరి రెండో కలయికలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ గా 'మేజర్‌' చిత్రం చేసారు. ఈ చిత్రం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
 
'మేజర్‌'తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన శేష్ తన తాజా తెలుగు సినిమా 'HIT2 'తో మరో బ్లాక్‌బస్టర్‌ని అందించారు. ఇదిలావుండగా అడివి శేష్ తన పాత్ బ్రేకింగ్ మూవీ 'గూఢాచారి' సీక్వెల్‌ ని G2 పేరుతో తదుపరి ప్రాజెక్ట్‌ గా ప్రకటించారు.
 
G2 టీం "ప్రీ విజన్" వీడియోను జనవరి 9వ తేదీనఢిల్లీ, ముంబై రెండింటిలో ఒకే రోజున విడుదల చేయనుంది.
 
 “మేజర్” చిత్ర ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. శేష్ స్వయంగా కథ రాశారు. ఈ భారీ-బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని మూడు ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌ లు కలసి నిర్మిస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
వీరి కొలాబరేషన్ లో ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ చిత్రాలు ఆల్ ఇండియన్ హిట్స్ గా నిలవడం గమనార్హం.
మేకర్స్ ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్‌ ను కూడా విడుదల చేసారు. ఇందులో బ్లాక్ సూట్‌ లో చేతిలో మెషిన్ గన్ పట్టుకుని, అతను యాక్షన్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తోంది.
 
గూఢాచారి కథ మొత్తం భారతదేశంలోనే జరగగా, G2 అంతర్జాతీయంగా ఉండబోతోంది. ఆల్ప్స్ పర్వతాలలో గూఢాచారి ముగిసిన ప్రదేశం నుండి గూఢచారి పార్ట్ 2 ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఉన్న స్టార్ కాస్ట్‌ తో అనేక కొత్త పాత్రలు చేరి రెట్టింపు యాక్షన్‌ ను డిజైన్ చేయాలని మేకర్స్ కోరుకుంటున్నారు.
 
కథ, మేకింగ్, సాంకేతిక ప్రమాణాలు, ఇంటర్నేషనల్ టీం పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. జనవరి 9న ప్రారంభించే బిగ్ "ప్రీ విజన్" కోసం వేచి చూడాలి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనూ సూద్ హై యాక్షన్ థ్రిల్లర్ ఫతే సెట్స్ కు ఎక్కబోతుంది