Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీర్‌కు జ‌ర్క్ ఇచ్చిన రోజా

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (19:16 IST)
sudheer-roja
న‌టి, బ‌జ‌ర్‌ద‌స్త్ జ‌డ్జి అయిన రోజా సెటైర్లు వేయ‌డంలో ముందంజ‌లో వుంటుంది. షోలో ఆర్టిస్టులు వేస్తున్న పంచ్‌ల‌కు అనుగుణంగా త‌నూ పంచ్‌లు వేస్తూ ఎంటర్‌టైన్ చేస్తుంది. ఒక ద‌శలొ నెగెటివ్ పంచ్‌లు, సెటైర్‌లు కూడా వేయ‌డంతో చేసేదిలేక వారంతా ఓ న‌వ్వు న‌వ్వేసి ఊరుకుంటారు. అలాంటిదే సుడిగాలి సుధీర్ కు ద‌క్కింది. ఇప్ప‌టికే రేష్మి, సుధీర్‌ల జంట గురించి అంద‌రికీ తెలిసిందే. వ‌చ్చే వారం ప్ర‌సారం కాబోయే ప్రోగ్రామ్ సంద‌ర్భంగా స్కిట్‌లో రోజా కూడా అంటెండ్ అవుతుంది. దానికి సంబంధించిన ఆమె స్టేజ్‌పైకి రాగానే సుధీర్‌.. ఎన్నాళ్ళ‌నుంచో మీకు మాకు పెద్ద‌గా వున్నారు. రేష్మితో చెప్పి మ‌మ్మ‌ల్ని ఒక‌టి చేయొచ్చుగ‌దా అని సుధీర్ అడిగాడు.
 
త‌డుముకోకుండా వెంటనే రోజా స్పందించింది. రేష్మిది గోల్డెన్ గొలుసు, నీది కుక్క‌ గొలుసు అంటూ పంచ్ వేసింది. దాంతో ఏం మాట్లాడాలో సుధీర్‌కు అర్థంకాక‌.. నాది కుక్క గొలుసా! అంటూ నోరు వెళ్ళ‌బెట్టాడు. అవును. భ‌లే క‌నిపెట్టావే.. అంటూ రోజా త‌న‌శైలిలో పెద్ద‌గా న‌వ్వేసింది. చూసేవారికి కుక్క‌, గోల్డెన్ ప‌దాలే గుర్తుండిపోయాయి. మ‌రీ కుక్క గొలుసుతో పోల్చిందేమిట‌ని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. నేను కుక్క‌నా.. అంటూ సుధీర్ కాసేపు మ‌ద‌న‌ప‌డిన‌ట్లు మాత్రం ఆ సీన్‌లో క‌నిపించింది. సో. మ‌రి ఈమే వారిద్ద‌రినీ గొలుసుల‌తో ముడివేస్తుందో విడ‌దీస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫెంగల్ తుఫాను-తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

కాకినాడ ఓడరేవు భద్రతపై పవన్ ఆందోళన.. పురంధేశ్వరి మద్దతు

పార్వతీపురంలో అక్రమ మైనింగ్.. ఆపండి పవన్ కళ్యాణ్ గారూ..?

ఎంఎస్ కోసం చికాగో వెళ్లాడు.. పెట్రోల్ బంకులో పార్ట్‌టైమ్ చేశాడు.. కానీ..?

'ఫెంగాల్' : దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమల్లో భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments