బుల్లితెరపై రేష్మి, సుధీర్ జంట చూడముచ్చటగా వుందని భావిస్తుంటారు. పలు టీవీ షోలలో కూడా పాల్గొంటూ తమ మధ్య మంచి రిలేషన్ వుందని చెబుతుంటారు. కానీ వీరిద్దరి వివాహం ఎప్పుడనేది చెప్పడానికి ఏదో కారణంతో వాయిదా వేస్తుంటారు. చాలాకాలంగా సాగుతున్న వీరి ప్రేమగోలకు క్లయిమాక్స్ పడిపోబోతోంది. ఈ విషయాన్ని ఇద్దరూ వెల్లడించారు.
అసలేం జరిగిందంటే. ఇటీవలే జబర్‌దస్గ్‌లో వారం వారం వచ్చే ఎపిసోడ్‌లో అలరిస్తుంటారు. శుక్రవారంనాడు రేష్మి యాంకర్‌గా హాజరైంది. అయితే మామూలుగా స్కిట్స్‌లు చేశాక ఎలా వుందనేది జడ్జిలను అడుగుతారు. కానీ ఈసారి స్కిట్ చేసిన గ్రూప్ సభ్యులనుంచి ఒక్కోక్కరిని మీ జీవితంలో తీపి గుర్తులు ఏమిటని, మెమొరబుల్ సంఘటనలు ఏమిటని రేష్మి అడిగింది. తలో గ్రూప్‌లో తలోవిధంగా వారి జీవితంలో సంఘటనలు చెప్పారు. ఫైనల్‌గా సుధీర్ ను అడిగింది. తాను జీవితంలో ఇల్లు, వాహనం, సరైన పేరు ప్రతిష్టలు కేవలం జబర్‌దస్త్ వల్లనే వచ్చాయనీ, అంతకంటే మించి రేష్మితో పరిచయం మర్చిపోలేనిదని వెల్లడించారు.
వెంటనే జడ్జి రోజా మరి ఎప్పుడు ఇద్దరూ ఒకటయ్యేది అని ప్రశ్నవేసింది. వెంటనే సుధీర్.. అంతా పైవాడిదయ అన్నట్లు చెబుతూనే.. మేమిద్దం కలిసి ఓ సినిమాలో హీరో హీరోయిన్లుగా చేస్తున్నాం. త్వరలో పెండ్లి కూడా చేసుకోబోతున్నామంటూ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ సమాధానికి రేష్మి ముసిముసి నవ్వులు నవ్వుకుంది. సో.. ఇలా మెమొరబుల్ కాన్సెప్ట్‌తో తమ మనసులోని మాటను ఇద్దరూ బయట చెప్పేశారన్నమాట.
ఇదిలా వుంటే, ఇదివరకే రేష్మి కూడా ఓ మాట అంది. బయట ఎక్కడికి వెళ్ళినా వేరే సినిమాల్లో చేస్తున్నా. సుధీర్‌తో తప్పితే చేయవద్దని అన్నారని కూడా వెల్లడించింది. అప్పుడు మగవారు ఎంతమదితోనైనా పురిహోర కలపవచ్చా అంటూ వ్యాఖ్యానించింది. ఫైనల్‌గా.. జనాలు చెప్పినట్లే ఇద్దరూ హీరోయిన్లుగా నటిస్తున్నారు.